అన్వేషించండి

Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయ్. దేవస్థానం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సర్వసన్నద్ధమైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉచిత దర్శనాలకు ప్రాధాన్యం; 100, 300, 500 టికెట్లు రద్దు.
  • 18 వేల మందికి హోల్డింగ్, వర్షాలకు ప్రత్యామ్నాయ క్యూ మార్గం.
  • తాగునీరు, మరుగుదొడ్లు, లడ్డూ ఏటీఎంలు; ముఖ గుర్తింపు భద్రత.

Indrakeeladri 2026: అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి.  రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చే దుర్గమ్మ దర్శనార్థం భారీగా భక్తులు తరలివస్తారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు.  ప్రభుత్వ నిర్ణయం మేరకు  సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ రూ.100, రూ. 300, రూ. 500 దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు.  

​రూ. 1,000 శీఘ్ర దర్శనం

ఎక్కువ సమయం క్యూలైన్లలో నిలబడలేని భక్తులకు రూ. 1,000 శీఘ్ర దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘మన మిత్ర’ వాట్సాప్  ద్వారా టికెట్లు పొందిన భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్ వద్ద TTD స్థలం నుంచి దేవస్థాన వాహనాల ద్వారా ఓం టర్నింగ్ వద్దకు..అక్కడి నుంచి ప్రత్యేక క్యూ మార్గంలో దర్శనానికి అనుమతిస్తారు. పూజా టికెట్లు తీసుకున్న భక్తులను పూజ పూర్తయ్యాక రథం సెంటర్ ఫ్లైఓవర్ క్రింద  ఫుట్ బ్రిడ్జి మీదుగా కాలువ ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి వాహనాల్లో కుమ్మరిపాలెం కేంద్రానికి చేర్చుతారు
 
​ప్రోటోకాల్ వేళలు

వీఐపీ, ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 06:00 నుంచి 08:00 వరకు మాత్రమే అంతరాలయ దర్శనం. సాయంత్రం పంచహారతుల తర్వాత రద్దీ తీవ్రతను బట్టి రాత్రి 08:00 నుంచి 10:00 గంటల మధ్య మరో విడత దర్శన ఏర్పాట్లు ఉంటాయి. 

​తొలి రోజు దర్శనాలు

ఉత్సవాల తొలి రోజైన అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నాడు వేకువజామున శ్రీ కనకదుర్గ అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష స్నపనాభిషేకం, దివ్య అలంకార పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి
 
​రద్దీ నియంత్రణ 

వినాయక టెంపుల్, కెనాల్ రోడ్డు, టోల్‌గేట్ మీదుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రద్దీ పెరిగిన తర్వాత వన్ టౌన్ వినాయక గుడి నుంచే ప్రవేశం ఉంటుంది.  

​వర్షాలు వస్తే ప్రత్యామ్నాయం

వర్షాలు లేదా అత్యవసర పరిస్థితులతో టోల్‌గేట్ మార్గాన్ని మూసివేయాల్సి వస్తే.. భక్తులను కనకదుర్గానగర్ మీదుగా మహామండపం ర్యాంపునకు మళ్లించే ప్రత్యామ్నాయ ప్రణాళిక దేవస్థానం వద్ద సిద్ధంగా ఉంది.  

​మూడు భారీ హోల్డింగ్ ప్రాంతాలు

దూరప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో వచ్చే భక్తుల కోసం సీతమ్మవారి పాదాల వద్ద, విద్యుత్ శాఖ–నగరపాలక సంస్థ కార్యాలయాల పరిసరాల్లో, పాత పూల మార్కెట్ ఖాళీ చేసిన రైల్వే స్థలంలో 3 హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

భద్రతకు సాంకేతిక బలం – రవాణా వ్యవస్థ 

​కొండపైకి అనుమతి లేని ప్రైవేటు వాహనాలను అడ్డుకునేందుకు ఓం టర్నింగ్ వద్ద  క్యూఆర్ కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.  8 దేవస్థాన బస్సులతో పాటు మినీ బస్సులు, టెంపోలు నిరంతరం రాకపోకలు సాగిస్తాయి. దివ్యాంగులకు ఉచిత రవాణా వాహనాలు అందుబాటులో ఉంటాయి.

​అన్నప్రసాదం

నూతన అన్నదాన భవనంలో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సౌకర్యం ఉంది. రోజుకు 10 వేల నుంచి 15 వేల మందికి పైగా ఉదయం అల్పాహారం (ఉప్మా, పొంగలి, దద్దోజనం), మధ్యాహ్నం,  రాత్రి వేళల్లో నిరంతరం శుచికరమైన అన్నప్రసాదం వడ్డిస్తారు.

​లడ్డూ ప్రసాదం

మొత్తం 18 కౌంటర్లు.. అందులో 4 కౌంటర్లలో ఆన్‌లైన్ బుకింగ్/క్యూఆర్ కోడ్ విధానం ద్వారా, 14 కౌంటర్లలో నేరుగా ప్రసాదం అందజేస్తారు.  

​తాగునీరు & పారిశుద్ధ్యం

క్యూ మార్గాలు, హోల్డింగ్ కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, కొండపై కలిపి 54 ప్రాంతాల్లో తాగునీటి ఏర్పాట్లు చేశారు.  వివిధ ప్రాంతాల్లో 370 మరుగుదొడ్లు, 600 షవర్లు , దుస్తులు మార్చుకునే గదులు, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు.

​ధర్మ ప్రచారం

ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కళావేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు, సాయంత్రం 04:00 గంటలకు పురవీధులలో దివ్య నగరోత్సవం  జరుగుతాయి.  

​దేవస్థానం, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కలిపి 5,000 మందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటలు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తారు. ​భక్తులంతా అధికారుల సూచనలు పాటిస్తూ, క్రమశిక్షణతో నిర్దేశిత మార్గాల్లో రాకపోకలు సాగించి ప్రశాంత వాతావరణంలో  కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని దేవస్థానం ఈవో విజ్ఞప్తి చేశారు.

Frequently Asked Questions

దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శన టికెట్ల విధానం ఎలా ఉంటుంది?

సామాన్య భక్తుల కోసం రూ. 100, 300, 500 టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనం కల్పించారు. ఎక్కువ సమయం వేచి ఉండలేని వారికి రూ. 1,000 శీఘ్ర దర్శనం అందుబాటులో ఉంది.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి మరియు తొలిరోజు దర్శనాలు ఎప్పటినుండి ఉంటాయి?

దసరా మహోత్సవాలు అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమవుతాయి. తొలి రోజు అమ్మవారికి విశేష పూజల అనంతరం ఉదయం 08:00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించబడుతుంది.

భక్తుల రద్దీ నియంత్రణకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు?

భక్తుల కోసం 18,000 మంది సామర్థ్యంతో 3 భారీ హోల్డింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఒకేసారి 8,500 మంది వేచి ఉండే వెసులుబాటు ఉంది. వర్షాల వంటి అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయ క్యూ మార్గం కూడా సిద్ధంగా ఉంది.

భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయి?

54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. నిరంతరం అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అదనంగా లడ్డూ ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 21 జాతకం: ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల ఫలితాలు?
నవంబర్ 21 జాతకం: ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల ఫలితాలు?
సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల నవంబర్ 21 రాశిఫలాలు: ఎలాంటి ఫలితాలున్నాయ్?
సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల నవంబర్ 21 రాశిఫలాలు: ఎలాంటి ఫలితాలున్నాయ్?
నవంబర్ 21 రాశి ఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం - మీ భవిష్యత్తు ఇదే!
నవంబర్ 21 రాశి ఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం - మీ భవిష్యత్తు ఇదే!
ఈ సంఖ్య గల స్త్రీలు వైవాహిక జీవితంలో నాయకులుగా ఎందుకు ఎదుగుతారు?
ఈ సంఖ్య గల స్త్రీలు వైవాహిక జీవితంలో నాయకులుగా ఎందుకు ఎదుగుతారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget