అన్వేషించండి

Karthika Masam 2022: కార్తీక మాసంలో దీపదానం ప్రాముఖ్యత ఏమిటీ? ఏ విధంగా దానమివ్వాలి?

షోడశ దానాల్లో దీపదానం ఒకటి. విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం వస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. మరి ఈ దీపదానం విశేషత ఏంటో తెలుసుకోండి.

దీపదానం అనేది ఎవరైనా, ఎప్పుడైనా చేయవచ్చు.  అయితే విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని పొందగలం అని కార్తీక పురాణంలో పేర్కొన్నారు. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి ద‌గ్గ‌ర‌లో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈమాసంలో దీపారాధన, దీపదానం లాంటి వాటికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది. 

కార్తీక మాసం రాగానే మగువలంతా చేసేపని ఇంట్లో, తులసికోట దగ్గర, ఉసిరి చెట్టుకింద, గుళ్లలో దీపారాధన చేస్తుంటారు. రోజూ ఖచ్చితంగా సంధ్యా సమయంలో దీపారాధన చేస్తారు. అంతేకాదు ఈ మాసంలో దీపారాధనతో పాటూ దీపదానం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని కార్తీక పురాణంలో ఉంది.

మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది. ఈ నేను అహంకారం తొలగి భగవంతుడే సర్వజ్ఞుడు అనే భావన వస్తే వారి జీవితం వెలుగులమయం అవుతుంది. ఈ భావన కలగడానికే దీపదానం చేస్తారు. మనకు పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా పదహారు రకాల దానాల గురించిన ప్రస్తావన ఉంది. వాటిల్లో దీపదానం గురించి కూడా ప్రస్తావించారు. 

ఇక దీపదానం ఎలా చేయాలంటే.. బియ్యంపిండిని గానీ, గోధుమపిండిని ఆవుపాలతో కలిపి దీపాన్ని చేసి, అందులో పూవ్వొత్తి వేసి, ఇవేవీ లేదంటే చివరకు రెండు మట్టి ప్రమిదలలో నూనె కానీ, నెయ్యి కానీ వేసి పూవ్వొత్తి వేసి, దానిని పసుపు, కుంకుమ, పుష్పాదులతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సాయం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది. స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు.

ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పూవొత్తి పెట్టి దానం చేస్తుంటారు. ఇది దీపదానం కాదు. ఒక పాత్రలో ఉసిరికాయలని తీసుకుని దాని పక్కన దీపాన్ని ఉంచి, బియ్యంతో, పప్పులాంటి ధాన్యం ఉంచి.. వాటితో సహా దానం చేయాలి. దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఇవ్వాలి. దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్ప పూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిది. విశేషించి పంచ మహా పర్వాలు అంటే కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం చాలామంచిది.

"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం"
"దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ"

అనగా సర్వ జ్ఞాన స్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖములు కలిగించే ఈ దీపమును నేను దానం ఇస్తున్నాను. దీని వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక. అని శ్లోక భావం.  పై శ్లోకాన్ని చెబుతూ దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులుగానీ, విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటూ, మోక్షప్రాప్తి లభిస్తుంది. దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియక గానీ చేసే పాపాలు తొలగిపోతాయి. దీని ప్రాశస్తాన్ని తెలిపే కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు. అయితే దీపదానం ఇవ్వడం వీలుకాకుండే స్వచ్చమైన నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ దానితో పాటూ వత్తులను దేవాలయంలో దీపారాధన చేయడానికి ఇచ్చినా దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం.

Also Read: సర్పదోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున ఇలా చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget