Horoscope Today 1st March 2022: శివుడి అనుగ్రహం ఈ రోజు ఏ రాశులపై ప్రసరిస్తోందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
మార్చి 1 శివరాత్రి మంగళవారం రాశిఫలితాలు
మేషం
ఈ రోజు మీకు శుభదినం. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో స్నేహితుల సహాయం పొందుతారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తిచేస్తారు. ప్రేమికులు ఒకరికొకరు సమయం ఇవ్వగలుగుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృషభం
ప్రభుత్వ పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. రిస్క్ తీసుకోవద్దు. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. చెడు సహవాసం ఉన్నవారు ఇబ్బందులు పడతారు. పాత స్నేహితులను కలుస్తారు.
మిథునం
పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవరినీ నమ్మొద్దు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మాటలు తూలొద్దు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. యువకులకు కెరీర్ సంబంధిత ఆందోళనలు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారు.
కర్కాటకం
ఆధ్యాత్మిక యాత్రలు చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేపట్టొచ్చు. పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చించండి. నిరుద్యోగులకు ఈ రోజు శుభసమయం.
Also Read: అర్థనారీశ్వర తత్వం అంటే శరీరంలో సగభాగం పంచిఇవ్వడం కాదు
సింహం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు భవిష్యత్తులో ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
కన్య
మీ నైపుణ్యాలు పెరుగుతాయి. టెక్నికల్ వర్క్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. మీ గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయకండి.
తుల
మీరు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సుఖ సంతోషాలు, శ్రేయస్సు తగ్గే అవకాశం ఉంది. మీరు విచారకరమైన వార్తలు పొందొచ్చు. కార్యాలయంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ప్రేమికులకు మంచి రోజు అవుతుంది.
వృశ్చికం
ఈరోజు మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. వ్యాపార యాత్రకు వెళ్తారు. విద్యార్థులు సక్సెస్ అవుతారు. మనసులో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో చర్చిస్తారు. సంతోష కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: పురుషుడు స్థిర స్వభావం- స్త్రీ మాయాస్వరూపం ఇదే అర్థనారీశ్వర తత్వం
ధనుస్సు
వైవాహిక సంబంధాల్లో సమస్యలు పెరుగుతాయి. సంఘర్షణ ఉద్రిక్తతకు దారి తీస్తుంది. కొత్త పనులు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆలోచనల వల్ల ఇతరులు ప్రభావితం కావచ్చు. తప్పుడు పదాలు వాడొద్దు. పరిస్థితులను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
మకరం
పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. మీరు కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందుతారు. విద్యార్థుల సమస్యలను అధిగమించవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఎలాంటి కారణం లేకుండా వివాదాలు జరగవచ్చు. ప్రయాణం వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
కుంభం
తల పెట్టిన ఏపని అయినా ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలి. తీర్థయాత్రకు వెళ్ళేందుకు ప్రణాళిక వేసుకుంటారు. ఈ రోజు మీకు మంచి రోజు అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తొందరపాటు మానుకోండి. ప్రేమికులకు మంచిరోజు.
మీనం
ఎప్పటి నుంచో ఉన్న పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మీ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. రాజకీయ నాయకుల సమస్యలు తొలగిపోతాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ వైపు ఆకర్షితులవుతారు. సామాజిక వ్యక్తులను కలుస్తారు. ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంది.