Horoscope Today 28th February 2022: ఫిబ్రవరి చివరి రోజు ఏ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 28 సోమవారం రాశిఫలాలు
మేషం
మీరు మీ సహోద్యోగులకు ఇన్సిపిరేష్ గా మారుతారు. మీ పాపులారిటీ పెరుగుతుంది. ప్రభుత్వ పనులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ నైపుణ్యంతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేఅవకాశం ఉంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
మీరు కొంచెం వేరే ఆలోచనల్లో ఉంటారు. ఈ రోజు ఎవ్వరికీ ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు. కుల, మతాల గురించి గొప్పలు చెప్పుకునేవారు విమర్శలపాలవుతారు. పిల్లల పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఏకాగ్రతతో ఉండండి. సీనియర్ల సలహాలు తీసుకోండి.
మిథునం
మీరు మానసికంగా కలవరపడతారు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు. అధికారుల మాట వినాల్సి రావచ్చు. ఈరోజు ప్రయాణాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ప్రేమ కొనసాగుతుంది.
కర్కాటకం
మీ ప్రయత్నాలు ఇతరులకు మేలు చేస్తాయి. భాగస్వామ్యంతో కొత్త పనులు ప్రారంభించవచ్చు.ఈ రోజు మీరు సామాజికంగా చాలా ప్రశంసలు పొందుతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సింహం
మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పొందుతారు. ఏ విషయంలోనైనా తక్షణ నిర్ణయం తీసుకోవడం అవసరం. కష్టపడి పని చేస్తేనే మీ పని పురోగమిస్తుంది. పిల్లల వైపు విజయం సాధిస్తారు.ప్రేమ జీవితంలో కొత్త మలుపు తిరుగుతుంది.
కన్య
మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రభుత్వ పనులు జాగ్రత్తగా చేయండి. ప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతుంది. మీరు సామాజిక సేవలో ఆసక్తిని కనబరుస్తారు. దిగుమతి-ఎగుమతికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు ప్రయోజనం పొందుతారు. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఆలోచించకుండా ఖర్చు పెట్టకండి. మీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు.
తుల
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. మీరు మీ కెరీర్ గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ సహకార ప్రవర్తన అందర్నీ ఆకట్టుకుంటుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చికం
మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. అనుభవజ్ఞుల సలహాతో వ్యాపారం ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. మిత్రులను కలుసుకోగలుగుతారు. ప్రేమికులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. విద్యార్థులు గొప్ప అవకాశం పొందవచ్చు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.
ధనుస్సు
మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. మీరు క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితుల మద్దతు పొందుతారు. ఆర్థిక స్థితి బావుంటుంది. మీరు సౌకర్యాలను అనుభవిస్తారు. ప్రేమికులు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు. కుటుంబ కలహాలలో సమస్యలు పెరగవచ్చు. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆలయ దర్శనానికి వెళ్తారు.
మకరం
మీరు చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. ఫార్మాస్యూటికల్ వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తెలియని వ్యక్తులతో వ్యవహరించవద్దు. ఈ రోజు ప్రేమికులకు చాలా సంతోషకరమైన రోజు.
కుంభం
వ్యాపార మార్పు నిర్ణయాన్ని వాయిదా వేయాలి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. పాత మిత్రులను కలుస్తారు.
మీనం
కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. పిల్లలతో కలిసి షికారు వెళ్తారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ సామాజిక స్థితి మారుతుంది. వ్యాపార సంబంధాలు బలపడతాయి. ఉద్యోగాలు మారే ఆలోచనలు చేస్తారు. ప్రేమికులు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.