Horoscope Today 31January 2022: ఒకరి సంతోషం కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ రాశి ఫలితం తెలుసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

జనవరి 31 సోమవారం రాశిఫలాలు
మేషం
మేష రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటారు.  తెలియని వ్యక్తుల వల్ల మీ పనికి కొంత ఆటంకం ఏర్పడవచ్చు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు వ్యాపారలకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీరు ఈ రోజు బంధువులను కలుస్తారు. 

వృషభం
ఒకరిని సంతోషపెట్టేందుకు మీ సమయం వృధా చేసుకోవద్దు.  ఈ రోజు మీరు ఆఫీసులో ఒక పెద్ద బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. పాత స్నేహితులతో పార్టీ చేసుకుంటారు. అనవసర మాటలు వద్దు. మీ మనసు చాలా తేలికగా ఉంటుంది. 

మిథునం
మిథున వారికి ఈరోజు మిశ్రమఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..గాయపడే ప్రమాదం ఉంది. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంపద పెరిగే అవకాశం ఉంది. తెలియని అడ్డంకులు ఎదురవుతాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. 

కర్కాటకం
ఈరోజు మీకు సంతోషకరమైన రోజు. పిల్లల వైపు సాధించిన విజయంతో మీరు ఉత్సాహంగా ఉంటారు. మానసిక బాధ నుంచి ఉపశమనం పొందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.  మీరు మీ కుటుంబ పరిస్థితితో సంతృప్తి చెందుతారు. ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంది. 

సింహం
ఈరోజు మీ మనస్సు చదువుపై నిమగ్నమై ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులను కలిసిన తర్వాత మీ ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. మీరు జీవిత తత్వశాస్త్రం వైపు మొగ్గు చూపుతారు. ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో ఇంటి నుంచి బయటకు రావాలి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు.

కన్య
ఈ రోజు మీరు పెద్ద బాధ్యత కారణంగా అలసిపోతారు. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. కడుపు, తలనొప్పితో బాధపడతారు. మీ పని తీరు అందర్నీ  ఆకట్టుకుంటుంది. తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు. మీ మనస్సు వినోద సాధనాల వైపు ఉంటుంది. ఈరోజు మీరు పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. ,

తుల
సామాజిక సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీడియా లేదా కళలకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అనవసర పనులపై మీ సమయాన్ని వృథా చేయకండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఎవరైనా సహాయం కోసం మీ వద్దకు రావచ్చు.

వృశ్చికం
ఈరోజు, మీ పెద్ద సమస్య తొలగిపోయి సంతోషాన్ని పొందుతారు. మీరు కొత్త ఉద్యోగానికి వెళ్లవచ్చు. మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులను కలుస్తారు. రాజకీయ రంగ ప్రజలకు ఈ రోజు మంచి రోజు. యువకులు పోటీ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. బ్యాంకు లేదా ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులను పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు 
ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఈ రోజంతా బాగానే ఉంటుంది కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించండి. అనవసర విషయాలకు డబ్బు ఖర్చు చేయవద్దు.  పొదుపు చేసే దిశగా ఆలోచనచేయండి. 

మకరం
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. బంధువులను కలుస్తారు. పూజ, పారాయణం పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు మతపరమైన యాత్రలకు వెళతారు. ఒకరి మాటలో పడి సమస్యల్లో చిక్కుకోవద్దు. 

కుంభం 
మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తెలియని అడ్డంకి మీకు తెలియకుండానే తొలగిపోతుంది. మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాయామం చేయడం వల్ల మీకున్న చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెద్ద బాధ్యత తలకెత్తుకుంటారు. విద్యార్థులుకు మంచి రోజు. 

మీనం
ఈరోజు ఎవరైనా మిమ్మల్ని టెన్షన్ పెట్టొచ్చు. మానసికంగా ఇబ్బంది పడతారు. కుటుంబ అవసరాలు సమయానికి తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు. ఆలోచనలు, మాటలు నియంత్రించుకోవడం మంచిది. 

Also Read:  వసంత పంచమి ప్రత్యేకత ఇదే... వ్యాసమహర్షి ప్రతిష్టించిన సరస్వతీ నిలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే..
Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Published at : 31 Jan 2022 06:04 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 31th 2022

సంబంధిత కథనాలు

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

టాప్ స్టోరీస్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!