Horoscope 9th June 2022: ఈ రోజు ఈ రాశులవారి కష్టాలు తొలగిపోతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 9th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
2022 జూన్ 09 గురువారం రాశిఫలాలు
మేషం
మీ అప్పులు తీరతాయి. ఆర్థిక పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ రోజంతా యాక్టివ్ గా ఉంటారు.చిన్ నచిన్న ఖర్చుల విషయంలో ఒత్తిడికి లోనుకాకండి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచి సమయం.
వృషభం
ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. దృఢ సంకల్పంతో సంక్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది.
మిథునం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వ్యాపారంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. గతంలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది.
కర్కాటకం
కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు లాభం పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి.షేర్ మార్కెట్ నుంచి ఆశించిన ధనలాభం ఉంటుంది. ఈరోజు పనులన్నీ తొందరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమికులు వారి సంబంధం పట్ల మక్కువతో ఉంటారు. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందుతారు.
సింహం
ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రణాళికలను బహిర్గతం చేయొద్దు. మీ మాటలు చాలా షార్ప్ గా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువత తమ కెరీర్‌పై చాలా సీరియస్‌గా ఉంటారు. ఉన్నతులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది.
కన్య
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు నిపుణుల సహాయం అందుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు మేలు చేస్తాయి. చిన్న తరహా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. అధికారులతో మాటపట్టింపులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ధారించుకోండి. మీ వ్యాపారం బాగా సాగుతుంది.
వృశ్చికం
వ్యాపారులు లాభాలు పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులను ఆకట్టుకుంటారు. మీ సూచనలను అందరూ అనుసరిస్తారు. మంచి వ్యక్తులను కలుస్తారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఈరోజు మీ ప్రయాణం వాయిదా వేయండి.
ధనుస్సు
మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచి రోజు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరం
మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల మీపై వ్యతిరేకత పెరగొచ్చు. ఉద్యోగులు పనిని బాధ్యతాయుతంగా చేయండి.
కుంభం
కొందరికి మీపై కోపం రావొచ్చు. మీ మాటతీరు మార్చుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత రుణం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులను బలహీనులుగా భావించే పొరపాటు చేయవద్దు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వివాదాస్పద విషయాలను చర్చించవద్దు.
మీనం
సాంకేతిక విధులు మీకు ఆసక్తి కలిగిస్తాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.