Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది
మీ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయని గమనించండి.
![Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది Horoscope 5th August 2022: Astrological prediction for Libra, Aries and Other Zodiac Signs check Astrological Prediction Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/78731646b65a1930a48a805bb8bb0af41659661155_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మేషం
ఉద్యోగులకు, ఉన్నతాధుల సహకారం అందుతుంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడతారు. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది.
వృషభం
పని చేసే రంగంలో మార్పులుండవచ్చు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఏదో విషయంలో మానసికంగా బాధపడతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు రావొచ్చు.
మిథునం
ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఉద్యోగులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. మనస్సు చంచలంగా ఉంటుంది. ఏదో తెలియని భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కార్యాలయంలో అనుకూల పరిస్థితి ఉంటుంది.
కర్కాటకం
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. విద్యా విషయాల్లో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉండొచ్చు. మనశ్శాంతి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర వివాదాల వల్ల మనసు కష్టంగా అనిపిస్తుంది.
సింహం
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టేందుకు మంచి రోజు. వ్యాపారం పెరుగుతుంది. మితిమీరిన ఉత్సాహాన్ని తగ్గించుకోండి. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కన్య
మీ మాటలో మృదుత్వం ఉంటుంది. విద్యా రంగానికి , పరిశోధనా రంగానికి చెందిన పనుల్లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తుల
ఈరోజంతా ఆనందంగా ఉంటారు.మీ సహనం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. అధిక కోపాన్ని నివారించండి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఆదాయం పెరుగుతుంది. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం
మీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు లభిస్తాయి. వాహన సుఖం ఉంది. మనశ్శాంతి ఉంటుంది.
ధనుస్సు
ఈ రోజు మనసుకు ఆనందంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మీపై కొంత ప్రభావం చూపిస్తాయి. సంభాషణలో మితంగా ఉండండి.
మకరం
కాస్త ఓపికగా వ్యవహరించండి. అనవసరమైన కోపం మానుకోండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకుంటే ఇబ్బందులు తప్పవు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం
ఏదో విషయంపై తీవ్రంగా ఆలోచిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. పని ఎక్కువ అవుతుంది. ప్రసంగంలో కఠినత్వం ప్రభావం చూపుతుంది. సహనం లోపిస్తుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మేధోపరమైన రచనలు డబ్బు సంపాదించే సాధనంగా మారవచ్చు.
మీనం
అనవసరమైన కోపం, వాదనలకు దూరంగా ఉండండి. విద్యా విషయాల్లో ఆసక్తి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు.
Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)