Horoscope 14th July 2022: ఈ రాశులవారికి ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope 14-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 14 గురువారం రాశిఫలాలు (Horoscope 14-07-2022)
మేషం
న్యాయపరమైన కేసుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అంతా బాగానే ఉంటుంది. కొన్ని సంఘటనల వల్ల పరధ్యానంలో ఉండొచ్చు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది.
వృషభం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. సమీపంలోని ప్రదేశానికి ప్రయాణించవలసి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
మిథునం
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఎత్తులు వేస్తారు. ఆఫీసులో అధికారులతో సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ పనుల్లో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ప్రమాదకర పనులను జాగ్రత్తగా చేయండి. ఈ రోజు మిమ్మల్ని కలవడానికి స్నేహితులు ఇంటికి రావొచ్చు. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి.
కర్కాటకం
వ్యాపారం పుంజుకుంటుంది. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. బాధ్యతల సక్రమంగా నిర్వర్తిస్తారు. విద్యార్థులకు చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. కార్యాలయంలో ఉన్నత స్థానం పొందుతారు.
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
సింహం
ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అధికారులు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. వెంటనే ఎవరినీ నమ్మవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
కన్యా
ఈరోజు బంధువులను కలుస్తారు. మీరు సత్సంగాన్ని ఆనందిస్తారు. సంక్లిష్టమైన విషయాలు తెలివిగా పరిష్కరించగలుగుతారు. పిల్లల అవసరాలకు డబ్బు ఖర్చు చేయవచ్చు. వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ప్రతిభను పెంచుకోవడానికి అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోండి. వృత్తిపరమైన ఆందోళనలు ఇబ్బంది కలిగిస్తాయి.
తులా
ఈ రోజు మీకు అంతబాలేదు. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. జాగ్రత్తగా ఆలోచించి అన్ని పనులు పూర్తిచేయవద్దు. వ్యాపారంలో వేగం మందగిస్తుంది.
వృశ్చికం
తప్పుడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీ నైపుణ్యం స్నేహితులకు ఉపయోగపడుతుంది., ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. మేనేజ్ మెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తుల బాధ్యత మరింత పెరుగుతుంది. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం వెతుక్కునేవారికి మంచి సమయం. ఎవ్వర్నీ తేలిగ్గా నమ్మొద్దు.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగులు మీ పట్ల అసంతృప్తిగా ఉంటారు. కొంతమంది వ్యక్తిగత పనుల్లో జోక్యం చేసుకుంటారు. కొత్త ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవచ్చు. పెట్టుబడికి అనుకూలమైన రోజు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తారు. పూజలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరం
మీరు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఉద్యోగులకు అస్థిరత దూరమవుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొత్త వారితో పరిచయం పెరుగుతుంది. టెన్షన్ తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.
కుంభం
పొట్ట సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మిత్రులతో సైద్ధాంతిక సమన్వయం తక్కువగా ఉంటుంది. వివాదాస్పద విషయాలపై కామెంట్ చేయొద్దు. బంధుమిత్రులతో చర్చలు జరిగే అవకాశం ఉంది. సన్నిహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చికిత్స ఖర్చు పెరగవచ్చు.
మీనం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి సమయం. మీ విజయాలతో సంతోషంగా ఉండండి. కుటుంబ సభ్యుల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఎక్కువ ఖర్చు కావొచ్చు.