అన్వేషించండి

Utpanna Ekadashi 2025: 24 ఏకాదశుల వ్రత ఫలితాలన్నిచ్చే ఉత్పన్న ఏకాదశి ఈ రోజే! తప్పకుండా ఈ స్తోత్రం పఠించండి!

Utpanna Ekadashi 2025 Wishes: నవంబర్ 15 ఉత్పన్న ఏకాదశి. ఈ రోజు వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశుల ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి...

Utpanna Ekadashi 2025: కార్తీకమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న అంటే ఉద్భవించింది అని అర్థం..ఈ రోజునే ఏకాదశి వ్రతం మొదటిసారిగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి..అందుకే ఉత్పన్న ఏకాదశి 24 ఏకాదశుల్లో చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు. మనకు కార్తీకమాసం అయినప్పటికీ.. ఉత్తరాదిన పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి మార్గశిరమాసం మొదలైంది. మనకు ఇది కార్తీక కృష్ణపక్ష ఏకాదశి అయితే... ఉత్తరాదివారికి మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి...

కార్తీక శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశి ఉత్పన్న ఏకాదశి
ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15 శనివారం వచ్చింది
 
పురాణ కథ 

మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన కథలో భాగంగా.. మురాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడిని బాధపెట్టేవాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. శ్రీ మహావిష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ గుహలో నిద్రపోతుండగా.. ఆ రాక్షసుడు దాడి చేశాడు. అప్పుడు విష్ణువు నుంచి ఒక దివ్య కన్య (ఏకాదశి దేవి) ఉద్భవించి మురాసురుడిని సంహరించింది. అప్పటి నుంచి ఆమె పేరుమీదు ఏకాదశి వ్రతం ఆచరించడం మొదలైంది. ఏకాదశి వ్రతం చేసేవారికి పాప విమోచనం, మోక్ష ప్రాప్తి లభిస్తాయని చెబుతారు. రోజంతా ఉపవాసం ఆచరించి..ద్వాదశి ఘడియలు ప్రారంభమైన తర్వాత ఉపవాసం విరమించాలి. పండ్లు తీసుకోవచ్చు. రోజంతా భగవంతుడి నామస్మరణలోనే ఉండాలి. విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే వినాలి. ఏకాదశి ఉద్భవించిన రోజుగా చెప్పే ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరిస్తే సహస్ర ఏకాదశుల ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం, భగవద్గీతతో పాటూ.. భక్తి శ్రద్ధలతోే నారాయణ స్తోత్రం పఠించినా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. 

నారాయణస్తోత్రమ్ 

నారాయణ నారాయణ జయ గోవింద హరే ||
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ ||  
నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ||  

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ||  
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 
రాధాఽధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ||  

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 
[* బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ *]
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || 

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || 
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || 

అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || 
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || 

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || 
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || 

సరయూతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ || 
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ || 

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || 
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || 

దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ || 
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || 

వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || 
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || 

జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ || 
తాటకమర్దన రామ నటగుణవివిధధనాఢ్య నారాయణ || 

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || 
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || 

అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || 
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ || 

భారతియతివరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత నారాయణస్తోత్రమ్ |

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునే ముందు మీకు నమ్మకమైన వాస్తుశాస్త్ర పండితులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించుకోండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget