అన్వేషించండి

Happy Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ, భక్తులతో కళకళలాడుతున్న ఇంద్రకీలాద్రి!

Indrakeeladri: శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చింది కనకదుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడుతోంది

Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. త్రిపురిని భార్య  త్రిపుర సుందరీ దేవి  అంటే ఈశ్వరుడి భార్య అయిన
గౌరీదేవి అని అర్ధము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి.  అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక  ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది.  సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది అంటారు. విద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని.. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

ధ్యానం

బాలార్కమండలాభాసాం చతుర్బాహాం త్రిలోచనామ్ |

పాశాంకుశ శరాఞ్శ్చాపాన్ ధారయంతీం శివాం భజే ||

 

బాలార్కయుతతైజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం |

నానాలంకృతిరాజమానవపుషం బాలేందు యుక్ శేఖరాం |

హస్తైరిక్షుధనుః సృణిం సుమశరాం పాశం ముదాబిభ్రతీం

శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం భజే ||

 

పద్మరాగ ప్రతీకాశాం సునేత్రాం చంద్రశేఖరామ్

నవరత్నలసద్భూషాం భూషితాపాదమస్తకామ్ ||

పాశాంకుశౌ పుష్ప శరాన్ దధతీం పుండ్రచాపకమ్

పూర్ణ తారుణ్య లావణ్య తరంగిత కళేబరామ్ ||

 

స్వ సమానాకారవేషకామేశాశ్లేష సుందరామ్ |

చతుర్భుజే చంద్రకళావతంసే

కుచోన్నతే కుంకుమ రాగ శ్రోణే

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే

నమస్తే జగదేక మాతః ||

స్తోత్రం ||

శ్రీం బీజే నాద బిందుద్వితయ శశి కళాకారరూపే స్వరూపే

మాతర్మే దేహి బుద్దిం జహి జహి జడతాం పాహిమాం దీన దీనమ్ |

అజ్ఞాన ధ్వాంత నాశక్షమరుచిరుచిర ప్రోల్లసత్పాద పద్మే

బ్రహ్మేశాద్యఃసురేంద్రైః సురగణ వినతైః సంస్తుతాం త్వాం నమామి ||

 

కల్పో సంపరణ కల్పిత తాండవస్య

దేవస్య ఖండపరశోః పరభైరవస్య |

పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణా

ససాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా ||

హ్రీంకారమేవ తవనామ గృణంతి యేవా

మాతః త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే |

త్వత్సంస్మృతౌ యమభటాభి భవం విహాయ

దీవ్యంతి నందన వనే సహలోకపాలైః ||

 

ఋణాంకానల భానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యేస్థితామ్

బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం |

చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం

తాం త్వాం చంద్రకళావతంసముకుటాం చారుస్మితాం భావయే ||

 

సర్వజ్ఞతాం సదసివాక్పటుతాం ప్రసూతే

దేవి త్వదంఘ్రి నరసిరుహయోః ప్రణామః |

కించిత్స్ఫురన్ముకుటముజ్వలమాతపత్రం

ద్వౌచామరే చ మహతీం వసుధాం దధాతి ||

 

కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభిః

లక్ష్మీ స్వయంవరణమంగళదీపకాభిః |

సేవాభిరంబ తవపాదసరోజమూలే

నాకారికిమ్మనసి భక్తిమతాం జనానాం ||

 

శివశక్తిః కామః క్షితిరథరవిః శాంత కిరణః

స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః |

అమీ హృల్లేఖాభిస్తి సృభిరవసానేషు ఘటితా

భజంతే వర్ణాస్తే తవజనని నామవయవతామ్ ||

 

కదాకాలే మాతః కథయకలితా లక్తకరసం

పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్ణేజనజలం |

ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా

సదాధత్తే వాణీ ముఖకమల తాంబూల రసతామ్ ||

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget