Gold Investment: బంగారం పెట్టుబడికి శుభ సమయం ఏంటి? ఈ గ్రహాల కలయికలో పెట్టుబడి పెడితే లాభాలేనా!
బంగారం పెట్టుబడి జ్యోతిష్యం: బంగారం ఎప్పటికీ మట్టి కాదు. గురు, శుక్ర గ్రహాల శుభ స్థితిలో పెట్టుబడి లాభదాయకం.

Gold Investment: భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత విశిష్టత ఉంది. శుభకార్యాల్లో బంగారానిదే మొదటి ప్రాధాన్యం. దాని విలువ ఎప్పటికప్పుడు పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే మధ్యతరగతి నుంచి కోటీశ్వరుల వరకు పొదుపును బట్టి బంగారంలో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దీని వల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది. అందుకే ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా, శాశ్వత పెట్టుబడిగా కూడా చూస్తారు. బంగారం ఒక సాంప్రదాయ ఆస్తి , బలమైన ఆర్థిక సాధనంగా కూడా పరిగణిస్తారు.
హిందూ మతం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం కొనడానికి, అమ్మడానికి, ధరించడానికి , తీయడానికి కూడా సరైన తేదీలు లేదా రోజులు చెబుతారు. అందుకే బంగారం కొనే ముందు శుభ ముహూర్తం లేదా శుభ దినంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు, తద్వారా వారికి దాని ప్రయోజనం లభిస్తుంది.
బంగారం పెట్టుబడికి ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు బంగారం లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే..ఇందుకోసం శుభ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తి జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయవు, ఆర్థిక మార్కెట్ (షేర్ మార్కెట్), పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్) ధనానికి కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. శుభ గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నప్పుడు, ధన వృద్ధి, పెట్టుబడిలో లాభం , ఆర్థిక స్థిరత్వం అవకాశాలు కూడా పెరుగుతాయి.
జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం..
గురువు (బృహస్పతి) శుక్రుడు వంటి శుభ గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఈ గ్రహాల అనుకూల కదలికతో ధన లాభం, పెట్టుబడిలో లాభం , లక్ష్మీదేవి అనుగ్రహం యోగాలు ఏర్పడతాయి. అందువల్ల, ఆకాశంలో శుభ గ్రహాల కలయిక జరిగినప్పుడు, భూమిపై బంగారం దాని అసలు విలువ కంటే ఎక్కువ మెరుస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన బంగారం భవిష్యత్తులో కూడా లాభాన్ని ఇస్తుంది. అదే సమయంలో జాతకంలో ఈ రెండు గ్రహాల శుభ స్థానంతో పాటు సూర్యుడు బలంగా ఉంటే, పెట్టుబడి నుంచి మంచి లాభం పొందే అవకాశం పెరుగుతుంది.
ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఏదైనా శుభ యోగం ఏర్పడుతుందా?
ప్రస్తుతం గురువు - శుక్రుల కలయికతో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అలాంటి బలమైన యోగం ఏదీ ఏర్పడటం లేదు. కానీ ఈ సమయంలో శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నాడు, ఇది ఏ రకమైన పెట్టుబడికైనా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో బంగారం వంటి శాశ్వత పెట్టుబడి నుంచి కూడా లాభం వచ్చే అవకాశం ఉంది.
నవంబర్ 2, 2025న శుక్రుడు తన స్వంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించాడు. తులా రాశిలో శుక్రుడు బలమైన స్థితిలో ఉంటాడు. శుక్రుడు ధనం, విలాసం భౌతిక సుఖాలకు కారకుడు... శుక్రుడు సొంత రాశిలో ఉండటం ధన సంబంధిత విషయాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అదే సమయంలో, బృహస్పతి (గురువు) ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్ర గతిలో ఉన్నాడు. గురువు వక్రించినప్పుడు, బంగారం కారకంగా అతని వేగం నెమ్మదిస్తుంది. ఇది కొన్నిసార్లు మార్కెట్లో అస్థిరత లేదా పెద్ద పెట్టుబడుల కోసం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునే ముందు మీకు నమ్మకమైన పండితులను సంప్రదించండి..






















