అన్వేషించండి

Garuda Purana : నరకం అంటే ఏంటి - ఇక్కడకు ఎవరెళతారు!

Garuda Purana: గరుడపురాణంలో ప్రస్తావించిన నరకం ఉందా? నరకం అంటే ఏంటి? ఎలాంటివారు నరకానికి వెళతారు? వైతరణి నది గురించి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు?

Garuda Purana: శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి తీర్చిన సందేహాలే గరుడపురాణం. జీవుడి పుట్టుక నుంచి మరణం...మరణానంతరం ఆత్మ ప్రయాణం...స్వర్గం, నరకం వరకూ ప్రతి విషయం గురించి శ్రీ మహావిష్ణువు గరుడుడికి వివరించాడు. గరుడపురాణంలో ఓ అధ్యాయంలో పూర్తిగా నరకం, వైతరణి నది గురించి గరుత్మంతుడికి వివరించాడు శ్రీ మహావిష్ణువు. నరకం అంటే ఏంటి? నరకం ఎవరికి ప్రాప్తిస్తుంది? దాన్నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలను స్పష్టంగా వివరించాడు. పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుంచి నరకంలో అడుగుపెడతారు. ఈ మార్గంలోనే వైతరణి నది ఉంటుంది.

Also Read: అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది

ఈ పాపాలు చేస్తే దక్షిణద్వారమే
మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేసినవారు నరకంలోకి వెళ్లకతప్పదు. గరుడపురాణం ప్రకారం ఆ పాపాలు ఏంటంటే.. 

బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్య, గర్భపాతం చేసేవారూ, రహస్యంగా పాపపు పని చేసేవారూ, గురువులు పండితులను దూషించేవారు, శిశువులను చంపేవారు, తీసుకున్న అప్పు తీర్చకపోయినా వేరొకరి ద్రవ్యాన్ని అపహరించినా, విషం పెట్టి చంపేవారు నరకానికి వెళ్లాల్సిందే..

తప్పులు చేసేవారు..తప్పులు చేసేవారిని సమర్థించేవారు, మంచివారిని నిందించేవారు, దుర్మార్గులతో స్నేహం చేసేవారు..మంచివారిని నిందించేవారు, పుణ్యక్షేత్రంలో అస్సలు అడుగుపెట్టనివారు, వేదాలను నిందించేవారు, ఇతరుల సంతోషాన్ని చూసి ఏడ్చేవారు వైతరణి దాటి దక్షిణద్వారం ద్వారా నరకంలోకి అడుగుపెడతారు

చెడు మాటలు మాట్లాడేవారు, పెద్దలు మంచి చెప్పినా పట్టించుకోని వారు, తమని తాము పొగుడుకుని ఇతరులని తిట్టేవారు, అధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు, పతివ్రత అయిన భార్యను దూషించేవాడు, మాట తప్పేవాడు, దానం ఇచ్చిన తర్వాత బాధపడేవాడికి నరకం తప్పదు...

Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!

మంచి కార్యాలను అడ్డుకునేవారు,ఇతరుల భూములను ఆస్తులను స్వాధీనం చేసుకుేనవారు, పశువులకు మేతలేకుండా చేసిన వారు, గోవులను హింసించేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, అన్యాయంగా సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పూలు పండ్ల తోటల్ని ధ్వంసం చేసేవారు  నరకానికే వెళతారు...

ఈ పాపాలు చేసేవారందర్నీ...యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమభటులు వైతరణి నదిలోకి తోసేస్తారు. పాపాత్ములు ముందుగా వైతరణిలో పడి బాధలు అనుభవించిన తర్వాత వారి వారి పాపాలకు విడిగా శిక్షలుంటాయి. 

Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?

వాస్తవానికి గరుడ పురాణం అంటే మరణం, స్వర్గం, నరకం గురించి మాత్రమే కాదు..గర్భంలో శిశువు పడినప్పటి నుంచి పుట్టుక... ఆ తర్వాత ఆచరించాల్సిన కర్మలు...మరణం..మరణానంతరం ఆత్మ ప్రయాణం..శిక్షలు...పాప ఫలితంగా మరో జన్మ..ఇలా మొత్తం జీవన ప్రయాణం  గరుడపురాణంలో ఉంటుంది. పుణ్యకార్యాలు చేసేవారికి మరో జన్మ ఉండదు...పాపాత్ములకు మరో జన్మ తప్పదు. పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మను అనుసరించి అందుకు అనుగుణమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు. ఫలితం అనుభవించడం గర్భంలో ఉన్నప్పుడే మొదలైపోతుంది...అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా గరుడపురాణం చదివితే కొన్ని పాపాలను అయినా చేయకుండా ఉంటారు... కొన్నైనా పుణ్యకార్యాలు చేస్తారని చెబుతారు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Appudo Ippudo Eppudo: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటున్న నిఖిల్ - దీపావళికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్!
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటున్న నిఖిల్ - దీపావళికి థియేటర్లలో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్!
Ponnam On TollyWood : టాలీవుడ్‌కు హెచ్చరిక పంపిన కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ ఇచ్చిన సంకేతం అదేనా ?
టాలీవుడ్‌కు హెచ్చరిక పంపిన కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ ఇచ్చిన సంకేతం అదేనా ?
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Embed widget