Surya Grahan 2024: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఈ మూడు రాశుల వారికీ బ్యాడ్ టైం స్టార్ట్
Solar eclipse 2024: ఈ సంవత్సరం చైత్ర మాసం అమావాస్య రోజున తొలి సూర్యగ్రహణం సంభవించబోతుంది. అయితే, ఈ మూడు రాశులవారికి ఈ గ్రహణం అంత మంచిది కాదట.
Surya Grahan 2024: ఖగోళంలో జరిగే అనేక దృగ్విషయాలు గొప్ప శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 2024లో మొత్తం ఐదు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో రెండు సూర్యగ్రహణాలు, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఇది పశ్చిమ యూరో, ఉత్తర, దక్షిణఅమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల నందు కనిపించనుంది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహా సముద్రం మీదుగా ప్రారంభమవుతుంది. అమెరికా, కెనడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు కలిసి ఒక సరళ రేఖలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, భూమి, సూర్యుని మధ్య ఉన్నప్పుడు భూమిపై ఉన్న వ్యక్తులకు సూర్యకాంతి తక్కువగా కనిపించినప్పుడు, దానిని సూర్యగ్రహణం అంటారు.ఈ సందర్భంలో, "రింగ్ ఆఫ్ ఫైర్" మనకీ చాలా నిమిషాలు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం అనేక విశేషాలను కలిగి ఉంది.
గత ఏడేళ్లలో ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడడం ఇది రెండోసారి అని జోత్యిష్య నిపుణులు చెబుతున్నారు. చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 21, 2017న సంభవించింది. ఆ సమయంలో, యునైటెడ్ స్టేట్స్‌లో 215 మిలియన్ల మంది పెద్దలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సూర్యగ్రహణం 12 రాశుల వారి పైన ప్రభావం చూపనుంది. వారిలో ఈ రాశులవారికీ ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఆ రాశులవారెవరో ఇక్కడ చూద్దాం
తులా రాశి
మొదటి సూర్యగ్రహణం ఈ రాశి వారికి కష్టాలను పెంచనుంది. మీరు అనుకున్న పనులేమీ జరగవు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో అడ్డంకి వస్తుంది. ఒకటి కాదు అనేక సమస్యలు వస్తాయి. మీరు పనిచేసే ఆఫీసులో మీ సీనియర్లు వర్క్ విషయంలో కోపం తెచ్చుకునే సందర్భాలు వస్తాయి. మీ తప్పు లేకపోయినా మాట పడాల్సి ఉంటుంది. జీవితం మీకు పెద్ద పెద్ద సవాళ్ళని విసురుతూ ఉంటుంది. మీరు భయపడి అక్కడే ఆగిపోకండి.. ఓపిక పట్టి ముందుకు నడవండి.. మంచి రోజులు వచ్చే వరకు కష్టాలు తప్పవు. ఒక సమస్యను పరిష్కరించే లోపు ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. మీ కెరీర్‌లో కూడా కోలుకోలేని దెబ్బ తింటారు.
వృశ్చిక రాశి
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం వృశ్చికరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో రావాలనుకున్న డబ్బు కూడా మీ దగ్గరికీ రాదు. అడుగు పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతారు. ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి రావు.
వృషభ రాశి
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఈ అశుభంగా ఉండనుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కుటుంబంలో కలహాలు వస్తాయి. మీరు అప్పుల్లో ఉండవచ్చు.ఈ రాశి వారిలో నూతన వధూవరులు బ్యాడ్ న్యూస్ వింటారు. మీ ప్రేమ విఫలమవుతుంది. మీకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ధిక బాధలు ఎక్కువవనున్నాయి. వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉండదు. ఈ సమయంలో ఎవరితో కలవడానికి ఇష్టపడరు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే