Feng shui tortoise: ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టకుంటే అదృష్టం కలిసి వస్తుందా? ఏ దిక్కున పెట్టాలి?
ఫెంగ్ ష్యూయి లో తాబేలు బొమ్మ అదృష్టం, సంపద మాత్రమే కాదు ఆనందం ఆరోగ్యం కూడా తెస్తుందని చెబుతోంది.
ఇటీవల చాలామంది తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఈ తాబేలు ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం. ఫెంగ్ ష్యూయిలో రెడ్ ఫొనెక్స్, వైట్ టైగర్, గ్రీన్ డ్రాగన్, టార్టాయిస్ వంటి పవిత్రమైన జంతు ప్రతీకలు ఉన్నాయి. చైనీయుల పురాణాల్లో నల్లని తాబేలు ఆధ్యాత్మికత తాబేలు దీర్ఘాయుష్షు ప్రతీక. అంతేకాదు తాబేలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఒక సకారత్మక శక్తిని ప్రేరేపిస్తుంది. తాబేలు సంపదకు కూడా ప్రతీక. వ్యాపార స్థలాల్లో క్రిస్టల్ టార్టాయిస్ పెట్టుకుంటే ఆర్థిక పరిపుష్టి కలిగి స్థిరత్వం వస్తుంది. ఇది కొన్ని వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. వాస్తు ప్రకారం క్రిస్టల్ టార్టాయిస్ ఇంటి ఉత్తర భాగంలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. రకరకాల మెటిరియల్స్ తో చేసిన తాబేలు బొమ్మలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏది ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం.
గాజు లేదా క్రిస్టల్ తాబేలు
గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాయవ్యం లేదా నైరుతిలో పెట్టుకుంటే విజయం, అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు.
నల్ల తాబేలు
వృత్తి వ్యాపారాల్లో విజయం కోసం ఉత్తరంలో నల్ల తాబేలును పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
లోహపు తాబేలు
ఉత్తరం లేదా వాయవ్యంలో లోహపు తాబేలు పెట్టుకుంటే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో అభివృద్ధి సాధిస్తారు, వారిని అదృష్టం వరిస్తుంది.
నాణాలు కలిగిన తాబేలు
నాణాలు పట్టుకున్న తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సంపదను ఆకర్శిస్తుంది. సంబంధబాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యాన్ని అందిస్తుంది.
చెక్క తాబేలు
తూర్పూ లేదా ఈశాన్యంలో చెక్క తాబేలు పెట్టుకుంటే ఇంట్లోంచి నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధాలు బలపడటం మరోక లాభంగా చెప్పుకోవచ్చు.
తాబెలు బొమ్మతో కలిగే లాభాలు
- తాబేలు బొమ్మ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బెడ్ రూమ్ లో పెట్టుకుంటే నిద్ర లేమి సమస్య ఉండదు.
- తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపద, శక్తి, డబ్బు, హార్మొని తెస్తుంది.
- తాబేలు మరణరాహిత్యానికి సంకేతం. నీటిలో తాబేలు బొమ్మను పెట్టుకుంటే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
- తాబేలు బొమ్మ వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణను ఇస్తుంది.
- ఇంటి ముఖ ద్వారం దగ్గర తాబేలు బొమ్మ పెట్టుకుంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది.
- తాబేలు బొమ్మ శక్తి మరింత పెంచేందుకు అక్వేరియం దగ్గర లేదా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ దగ్గర పెట్టుకుంటే మంచిది.
- Also Read : Bad Dreams: పీడ కలలు వస్తున్నాయా? ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. ధైర్యంగా నిద్రపోవచ్చు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.