అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nails Cutting: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరిస్తున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోవల్సిందే!

Nails Cutting: సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా గోళ్లను కత్తిరించుకుంటే అలా చేయవద్దని పెద్దవాళ్ళు వారిస్తూ ఉంటారు. అయితే దీని వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Nails Cutting: రాత్రిపూట గోళ్లను కత్తిరించవద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత గోళ్లను కత్తిరించడం అరిష్టం అని సనాతన ధర్మంలో చెబుతోంది. దీనికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అవేంటో చూడండి.

నెగిటివ్ ఎనర్జీ :

రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అనే నియమం పెట్టడానికి ప్రధాన కారణం.. నెగిటివ్ ఎనర్జీ. ఇది దురదృష్టాన్ని తెస్తుంది. మన సనాతన ధర్మంలో కొన్ని చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయని నమ్ముతారు. వీటిలో ప్రధానంగా రాత్రిపూట గోళ్లను కత్తిరిస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని.. తద్వారా దురదృష్టం వెంటపడే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు. అందుకే కొంతమంది తెలియకుండా ఎవరైనా చీకటిలో గోళ్లు కత్తిరిస్తున్నట్లయితే.. వారిని వద్దు అని వారిస్తుంటారు. 

ఆత్మలకు భంగం కలుగుతుంది :

సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడమంటే భగవంతుడిని అగౌరవపరచడమే. రాత్రిపూట గోర్లు కత్తిరించడం పూర్వీకుల ఆత్మలకు భంగం కలిగిస్తుందని పండితులు నమ్ముతారు. 

పరిశుభ్రత:

సాయంత్రం పూట నెయిల్ కటింగ్ చేయకుండా ఉండడానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే.. రోజంతా, మన చేతులు, కాళ్ళు వివిధ రకాల పనులతో సంబంధం కలిగి ఉంటాయి, ఇది  మన చేతులు, కాళ్ళపై ధూళి కణాలు పేరుకుపోవడానికి దారితీస్తుంది. చేతులు కడుక్కోకుండా మన గోళ్లను కత్తిరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 

భద్రత:  

చీకటిలో వెలుతురు సరిగ్గా ఉండదు. అందుకే గోర్లు కత్తిరించడం మానుకోవాలని సూచిస్తుంటారు. సాయంత్రం పూట మీ గోళ్లను కత్తిరించడం వల్ల లైటింగ్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రమాదవశాత్తు గాయాలకు దారితీయవచ్చు. అలాగే సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడం కూడా సాయంత్రం సమయంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తుంది  . 

చంద్రుని శక్తి:

ఆయుర్వేదం ప్రకారం.. గోర్లు కత్తిరించడానికి, చంద్రుని శక్తికి నిర్దిష్ట సంబంధం ఉంది. చంద్రుడు ప్రశాంతతకు చిహ్నం. కాబట్టి, సాయంత్రం చంద్రుని శక్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, మీ గోర్లు కత్తిరించడం వలన దాని శక్తికి అంతరాయం కలిగించవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

లక్ష్మీదేవికి కోపం వస్తుంది:

సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి సూర్యా స్తమయం తర్వాత యాత్రకు బయలుదేరుతుంది. సాయంత్రం లేదా చీకటి పడ్డ తర్వాత గోర్లు కత్తిరించే ఇంటిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో శుభకార్యాలు నిలిచిపోతాయి. డబ్బు రావడం తగ్గడం మొదలవుతుంది. పొదుపు కూడా అయిపోతుంది.

గ్రహాలపై చెడు ప్రభావం ఉంటుంది:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం గ్రహాలపై, ముఖ్యంగా సూర్యుడు, శనిగ్రహాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుని ప్రతికూల ప్రభావం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనిదేవుడు గోళ్లలో ఉంటాడు. సాయంత్రం తర్వాత గోళ్లు కత్తిరించడం వల్ల శనికి కోపం వస్తుంది.

Also Read: కలలో దెయ్యాలు కనిపించడం దేనికి సంకేతం? ఏం జరుగుతుంది?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget