అన్వేషించండి

టాటూ వేయించుకుంటున్నారా? జాగ్రత్త, ఈ డిజైన్లు నెగెటివ్‌గా పనిచేస్తాయ్!

ఇప్పుడు యువతలో చాలా మంది శరీరం మీద టాటూలు వేయించుకుంటున్నారు. అయితే కొన్ని టాటూలు శరీరం మీద ఉండకూడదని పండితులు చెబుతున్నారు

ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది ఎప్పడెలాంటి రూపు దాల్చుతుందో చెప్పటం కష్టం. పచ్చబొట్టును ఒకప్పుడు ట్రైబల్ ఆర్ట్ గా పరిగణించే వారు. కానీ ఇప్పుడిదే ట్రెండ్. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అంతా పచ్చబొట్లు వేసుకుంటున్నారు. వాటిని టాటూలు అని అంటున్నారు. రకరకాల డిజైన్లు సృజనాత్మకంగా శరీరం మీద టాటూ గా వేసుకోవడానికి చాలా మంది ఇష్టం చూపుతున్నారు. అతి పురాతనమైన ఈ కళ గురించి, దీనిలో ఉపయోగించే డిజైన్ల గురించి శాస్త్రం కొన్ని నియమాలను కూడా చెప్పింది. కొన్ని రకాల టాటూ డిజైన్లను ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. పచ్చబొట్టు కథా కమామిషు గురించి తెలుసుకుందాం.

పగిలిన అద్దం

పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదు. పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం. పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభం అని వాస్తు చెబుతోంది. ఇది జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. ఇటువంటి టాటూలు శరీరం మీద వేయించుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు వెంటాడవచ్చు. వైఫల్యాలు కూడా ఎదురు కావచ్చు.

తిరగబడిన గుర్రపు డెక్క

గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం. అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేయించుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్ జీవితంలోని పాజిటివిటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు. ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే.

పగిలిన గడియారం

పగిలిన గడియారం దురదృష్టానికి సంకేతం. వాస్తు ప్రకారం పగిలిన గడియారం ఆగిపోయిన సమయానికి చిహ్నం. అలాంటి పచ్చ బొట్టు శరీరం మీద వేసుకుంటే జీవితంలో పురోగతి కుంటుపడుతుంది.

ఏడుపు ముఖం

విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి. దురదృష్టాన్ని ఆకర్శిస్తాయి. జీవితంలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. వాటిని వ్యక్తం చేసే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. దు:ఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద పచ్చబొట్టు గా వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి విశాదకర, విషణ్ణ వదనాల డిజైన్లను టాటూలుగా వేసుకోకూడదు. అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు కూడా మీ జీవితానికి హానికరమే. చూశారుగా.. ఇకపై టాటూల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Also read : Vastu Tips In Telugu: కెరీర్ ముందుకు సాగాలంటే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటిస్తే సరి

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

16-11-2026 సోమవారం రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - ఎవరికి విజయం? ఎవరు జాగ్రత్త?
16-11-2026 సోమవారం రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - ఎవరికి విజయం? ఎవరు జాగ్రత్త?
16-11-2026 సోమవారం రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చికం మీకు ఎలాంటి ఫలితాలు?
16-11-2026 సోమవారం రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చికం మీకు ఎలాంటి ఫలితాలు?
16-11-2026 సోమవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త!
16-11-2026 సోమవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త!
ఏలినాటి శని 2027-2030:  2027 నుంచి 2030 వరకు ఈ 2 రాశుల నీడలో శని! ఎవరికి కష్టాలు, ఎవరికి ఉపశమనం!
ఏలినాటి శని 2027-2030:  2027 నుంచి 2030 వరకు ఈ 2 రాశుల నీడలో శని! ఎవరికి కష్టాలు, ఎవరికి ఉపశమనం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget