అన్వేషించండి

Ashada Masam 2026 Dates: ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు! శుభకార్యాలు లేకపోతేనేం ఎన్నో విశిష్టతలున్నాయ్! 

Ashada Masam 2026: 2026 ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ఎప్పటివరకు? శుభకార్యాలు లేకపోయినా..ఈ నెలలో ఎన్నో విశిష్టతలున్నాయ్? అవేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆషాఢం దక్షిణాయనం ఆరంభం, శుభకార్యాలు నిషిద్ధం, ఆధ్యాత్మికంగా శ్రేష్ఠం.
  • వాతావరణ మార్పులు, అంటువ్యాధులు; బోనాలు, పూరీ రథయాత్ర ప్రధానం.
  • తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, స్కంద వ్రతాల ప్రాముఖ్యత ఉంది.

Ashada Masam Significance: ఆషాఢమాసం తెలుగు నెలల్లో నాల్గవది. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు. ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమయ్యే నెల ఇది.  సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోక ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ నెలలో వానలు ప్రారంభమవుతాయి.  ప్రకృతి పునరుజ్జీవనం పొందే కాలం ఇది. 

వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

2026 లో ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమై..ఆగష్టు 12 అమావాస్యతో పూర్తవుతుంది...

ఆషాఢం శూన్య మాసం కావడంతో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనం సహా శుభకార్యాలు నిషేధిస్తారు. ఆషాడంలో శుభకార్యాలు నిర్వహించకపోయినా..ఇంటి నిర్మాణం చేపడితే మంచిది. ఈ నెలలో గృహనిర్మాణం మొదలుపెడితే ఆ గృహస్తులు ధనధాన్యాలు, పశుసంపద, రత్న మాణిక్యాలు లభిస్తాయని చెబుతోంది మత్స్యపురాణం. ఇది శూన్యమాసమే కానీ అపవిత్రమైనది కాదు. భక్తి, జపం, దానం, ఉపవాసం, స్నానం, పారాయణం చేయడం ఎంతో ఫలప్రదం. శరీరం-మనసు-ఆత్మ శుద్ధికి ఈ నెల అత్యుత్తమం. పూర్వకాలంలో అందరి ఇళ్లలో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటిని శుభ్రపరుచుకునే ఆచారం అంతా పాటించేవారు. వెండి ,బంగారు ఆభరణాలు కూడా ఈ నెలలోనే మెరుగు పట్టించుకునేవారు.
 
వేసవి కాలం ముగిసి వానాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఆషాఢాన్ని సంధిమాసం అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయ్. అంటురోగాలు ప్రబలే సమయం. చర్మవ్యాధులు ఎక్కువగా ఉంటాయ్. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింట పెట్టుకుంటారు. 

 పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?

ఆషాఢమాసంలో ఎన్నో విశేష దినాలున్నాయి.

బోనాలు

ఆధ్యాత్మిక సాధనకు పవిత్రమైన ఆషాఢం బోనాలతో ప్రారంభమవుతుంది. ఈ నెలరోజులు గ్రామదేవత పూజలతో ఊరూవాడా సందడిగా మారుతుంది. గ్రామదేవతలకు పొంగళ్లు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుని...అమ్మవారిని ఆడబిడ్డలా ఇంటికి ఆహ్వానించి చీరలు,సారెలు సమర్పిస్తారు.  

పూరీ జగన్నాథుడి రథయాత్ర
 
ఆషాఢంలో వచ్చే అతిపెద్ద పండుగ జగాన్నేలే జగన్నాథుడి రథయాత్ర. మోక్ష ద్వారాలకు మార్గాన్ని చూపించే పూరీ జగన్నాథుడి రథయాత్ర చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు.

వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం

గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యేది కూడా ఈ నెలలోనే. శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లా ఈనెలలోనూ తొమ్మిది రోజులు తొమ్మిది మంది అమ్మవార్లను ఆరాధిస్తారు

10-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

స్కందవ్రతం

ఆషాఢ శుద్ధ షష్టి రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది. 

తొలి ఏకాదశి - చాతుర్మాస దీక్ష

ఆషాఢమాసంలో విశేష పర్వదినం అయిన తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటాడు..అందుకే శయన ఏకాదశి అంటారు. పీఠాధిపతులు, గురువులు, సాధువులు అంతా ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలు..కార్తీక శుద్ధ ఏకాదశితో ఈ దీక్ష ముగుస్తుంది. 
 
ఆషాఢ పూర్ణిమ-గురు పౌర్ణమి

ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమ అని వ్యాసపూర్ణిమ అని జరుపుకుంటారు. శ్రీమన్నారాయణుడి స్వరూపమైన వ్యాస భగవానుడి జన్మదినమైన ఈ రోజున గురువులను పూజిస్తారు. 
 
ఇంకా ఆషాఢ బహుళ సప్తమిని భోగ సప్తమిగా జరుపుకుంటారు..ఈ రోజు చెట్లను పూజిస్తారు..వానలు బాగా కురవాలని కోరుకుంటారు

ఆషాఢ బహుళ ఏకాదశి కామదా ఏకాదశిగా జరుపుకుంటారు..ఇహలోకంలో కోర్కెలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించమని పూజలు చేస్తారు

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

 

Frequently Asked Questions

ఆషాఢ మాసం అంటే ఏమిటి?

ఆషాఢ మాసం తెలుగు నెలల్లో నాల్గవది. ఇది ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమయ్యే నెల, వేసవి, వర్షాకాలాల మధ్య సంధి మాసం. ఈ మాసంలో వర్షాలు మొదలై ప్రకృతి పునరుజ్జీవనం పొందుతుంది.

ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించబడతాయా?

అవును, ఆషాఢం శూన్య మాసం కాబట్టి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిషేధిస్తారు. అయితే, ఇంటి నిర్మాణం చేపడితే ధనధాన్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది.

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

వర్షాకాలం ఆరంభంలో క్రిమికీటకాలు, చర్మవ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే ఆచారం ఉంది. ఇది సంధి మాసం కాబట్టి వాతావరణ మార్పుల నుండి రక్షణనిస్తుంది.

ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు, విశేష దినాలు ఏవి?

ఆషాఢ మాసంలో బోనాలు, పూరీ జగన్నాథుడి రథయాత్ర, వారాహి గుప్త నవరాత్రులు, స్కందవ్రతం, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి విశేష దినాలు ఉన్నాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget