అన్వేషించండి

Vidur Niti In Telugu : ఈ 4 ల‌క్ష‌ణాలున్న‌వారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!

Vidur Niti In Telugu : కొన్ని తప్పులు చేసిన వ్యక్తులు జీవితాంతం డబ్బు సమస్యల‌తో పేదరికాన్ని అనుభవిస్తారని విదుర నీతిలో పేర్కొన్నారు. పేదరికం ఎదుర్కొనే వ్యక్తులు చేసే తప్పులు ఏంటో మీకు తెలుసా?

Vidur Niti In Telugu : విదుర నీతిలో ఒక వ్యక్తి ఎందుకు దరిద్రుడు అవుతాడో తెలిపాడు. కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా  వారికి భగవంతుని ఆశీర్వాదం లభించదు. అలాంటి వారికి రోజూ ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. వారి ప్రయత్నాలు కేవలం వృధాగా మిగులుతాయి. విదురుడు చెప్పినట్టు మనం ఏ తప్పులు చేస్తే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తుతుంది.? మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారేమో గమనించుకోండి. 

1. వికారమైన వ్యక్తులు
విదుర నీతి ప్రకారం, తన ఇంటిని మురికిగా ఉంచుకునే వ్యక్తి లేదా తన శరీరాన్ని అప‌రిశుభ్రంగా ఉంచుకునే వ్యక్తి ఎల్లప్పుడూ పేదరికంలో ఉంటాడు. అలాంటి వారు ఎంత కష్టపడి పనిచేసినా సంపదను అనుభవించలేరు, భగవంతుడు కూడా అలాంటి వారిని అనుగ్రహించడు. ధనవంతులు కావాలనుకునేవారు లేదా భగవంతుని అనుగ్రహం పొందాలనుకునే వారు పరిశుభ్రంగా ఉండాలి, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.

Also Read : Vidura Niti In Telugu: ఈ 4 అంశాల‌కు దూరంగా ఉంటే విజయం సాధిస్తారు!

2. పెద్దలను అగౌరవపరచడం
విదురుడు చెప్పినట్లు పెద్దలను గౌరవించాలి. మనం వారికి సహాయం చేయగలిగే ప‌రిస్థితిలో ఉంటే త‌ప్ప‌కుండా చేయాలి. పెద్దలను గౌరవించని వ్యక్తి, పెద్దల గురించి ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడేవాడు, అలాంటి వ్యక్తులు వారి జీవితంలో డబ్బు సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూనే ఉంటారు. అందుకే మనం మన ఇంటి పెద్దలను ఎప్పుడూ అగౌరవపరచకూడదు.

3. శ్రమకు దూరంగా ఉండేవారు
మనం చేస్తున్న పని కష్టమైనదైనా, సులువైనదైనా.. మన దృష్టి మాత్రం చేయడంపైనే ఉండాలి. మనం చేస్తున్న పని కష్టం అని సగంలో విరమించకూడదు. కష్టపడి పనిచేసే వ్యక్తులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులకు డబ్బు సమస్యలు చాలా అరుదు. కూర్చొని పురోభివృద్ధి, ఉపాధి, సాఫల్యం కోరుకునే వారికి సులువుగా లభించడం అసాధ్యం. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి.

4. దేవుణ్ణి నమ్మని వారు
దేవుణ్ణి నమ్మని వ్యక్తి తన జీవితమంతా డబ్బు సమస్యలతో గడుపుతాడు. తన పనిలో విజయం సాధించాల‌నుకునే వ్యక్తికి ముందుగా భగవంతునిపై నమ్మకం ఉండాలి. భగవంతుడిని నమ్ముకున్న వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దేవుడు వచ్చి ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడని నమ్మకం. ఏదైనా పనిని ప్రారంభించే ముందు భగవంతుడిని స్మరించుకుని ఆ తర్వాత పని ప్రారంభించండి. ఇది మీకు పనిలో విజయాన్ని ఇస్తుంది.

Also Read : Vidura Niti In Telugu: ఈ 5 గుణాలు మీకుంటే మీ జీవితం ఆనందమయం

విదురుడు ప్రకారం, ఈ 4 ల‌క్ష‌ణాలు ఉన్న వ్యక్తి ఎంత ప్ర‌య‌త్నించినా జీవితంలో డబ్బు లేదా సంపదను అనుభవించలేడు. ధనాగమనం కావాలంటే ముందుగా పై 4 తప్పులు చేయకూడదు.         

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget