By: ABP Desam | Updated at : 18 Nov 2021 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Rachin-Ravindra
భారత్, న్యూజిలాండ్ మొదటి టీ20లో ఒక ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే కివీస్ యువ క్రికెటర్ 'రచిన్ రవీంద్ర'. భారత సంతతి వ్యక్తే కావడంతో భారతీయులు అతడి గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ పేర్లు కలిసేలా అతడు పేరు పెట్టుకోవడం గమనార్హం.
న్యూజిలాండ్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటున్నాడు రచిన్ రవీంద్ర. 2016, 2018లో కివీస్ తరఫున అండర్ 19 ప్రపంచకప్‌లు ఆడాడు. 2018-19లో సీజన్లో వెల్లింగ్టన్ తరఫున ఆడాడు. అదే సీజన్లో లిస్ట్-ఏ క్రికెట్లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. ఫోర్డ్ ట్రోఫీలో లిస్ట్-ఏలో తొలి శతకం అందుకున్నాడు. ప్లంకెట్ షీల్డ్‌లో ఫస్ట్‌క్లాస్ శతకం అందుకున్నాడు.
2020, నవంబర్‌లో న్యూజిలాండ్-ఏ తరఫున వెస్టిండీస్ పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడాడు. జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ జట్టులోనూ ఉన్నాడు. 2021, సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు టెస్టులు సిరీసులో అరంగేట్రం చేశాడు. బుధవారం టీమ్‌ఇండియాతో మ్యాచులోనూ ఆడాడు.
రచిన్ తల్లిదండ్రులు రవి కృష్ణమూర్తి, దీపా కృష్ణమూర్తి. తండ్రి రవి సిస్టమ్ ఆర్కిటెక్ట్. బెంగళూరులో ఉండేవారు. 1990లో న్యూజిలాండ్‌లో హట్‌హాక్స్ క్లబ్‌ను స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి అతడికీ క్రికెట్ అంటే ఇష్టం. బెంగళూరు జట్టులో ఆడుతుండేవాడు. కాగా రచిన్ నాలుగేళ్లుగా ఆంధ్రాలోని అనంతపురంలోనే క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి శీతాకాలం ఇక్కడి వచ్చి నాలుగు నెలలు ఉంటాడు.
Also Read: Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ind Set Huge Tgt to Eng: పట్టు బిగించిన భారత్.. ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్.. పంత్, రాహుల్ సెంచరీలు, బౌలర్లపైనే భారం
రోహిత్ శర్మ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఇన్స్టాలో స్టోరీని షేర్ చేశాడు; సోషల్ మీడియా పోస్ట్ వైరల్
Rishabh Pant Century: రిషబ్ పంత్ ఇంగ్లండ్ గడ్డపై రికార్డుల మోత! టెస్ట్ మ్యాచ్‌లో సంచలన సెంచరీలు
Rishabh Pant Record Century: పంత్ డబుల్.. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రిషభ్ సెంచరీ.. అరుదైన జాబితాలో చోటు.. రాహుల్ కూడా సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్
Ind vs Eng: బాజ్ బాల్: టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ విప్లవం.. దూకుడు ఆటతో సరికొత్త చరిత్ర!
CM Chandrababu: ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు - తొలి అడుగు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Free bus for Women: ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి నారా లోకేష్
Rythu Bharosa Success Meeting: మంగళవారం నాడు రైతు భరోసా విజయోత్సవ సభ, ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
8 Vasantalu OTT: ఓటీటీలోకి '8 వసంతాలు'... అనుకున్న తేదీ కంటే ముందుగా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?