YSRCP New Tension: వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, రీ సర్వే తర్వాత మళ్లీ సమన్వయకర్తలను మార్చేస్తుందా ?
YSRCP Re Survey: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్...సర్వేల మీద సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను ఖరారు చేస్తున్నారు.
New Tension To YSRCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party)పార్టీ గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jaganmohan Reddy)...రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సర్వేల మీద సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను ఖరారు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో మంచి పేరు ఉన్న నేతలకే సీటు ఖరారు చేస్తున్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితిపై లెక్కలు వేసుకున్న తర్వాతే టికెట్ కన్ఫామ్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా...సామాజిక సమీకరణాలలను లెక్కలు వేస్తున్నారు. ఎవరిని ఎక్కడ నుంచి బరిలోకి దించాలన్న దానిపై ఓ రేంజ్‌లో కసరత్తు జరుగుతోంది.
ఎంపీ మోపిదేవి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తారా ?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు జాబితాలను విడుదల చేశారు. 58 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ మార్పులు, చేర్పులు చేసిన నియోజకవర్గాల విషయంలో పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రీ సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. మార్పులు చేసిన నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు లేని చోట, కొత్త ముఖాలపై అభ్యంతరాలు ఉన్నాయని అంతర్గత నివేదికలు వస్తున్నాయి. పార్టీలోని నేతలే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కొంత మంది అభ్యర్ధుల విషయంలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ ఈవూరు గణేష్ ను సమన్వయకర్తగా నియమించింది. ప్రస్తుతం ఆయన అభ్యర్ధిత్వంపై ముఖ్యమంత్రి జగన్ డైలమాలో పడినట్లు సమాచారం. ఈవూరు గణేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత...లోకల్ గా సర్వే చేస్తే సంచలన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆయనకు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని తేలింది. దీంతో మొన్నటి వరకు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు చూసిన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని సూచనాప్రాయంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు అనుకూలించకపోతే...ఎంపీ మోపిదేవి వెంకటరమణారావును బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నాట్లు సమాచారం.
ప్రత్తిపాడు సమన్వయకర్త పార్టీ కేడర్ కు తెలియదా ?
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ ను తీసుకుని వచ్చి ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. బాలసానికి ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించడం వెనుక కారణాలు తెలియని కేడర్...ఆయోమయంలో పడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను కాదని కిరణ్ కు సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలసాని కిరణ్ అనే వ్యక్తి ఎవరో పార్టీలో ఉన్న వారికే తెలియదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అదే జిల్లాలోమల్లెల రాజేష్ నాయుడును...చిలకలూరిపేట ఇన్ఛార్జ్‌గా నియమించడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అక్రమ పశువుల వ్యాపారం చేసే వ్యక్తికి ఇంఛార్జ్ బాధ్యతలు ఎలా ఇస్తారని సొంత పార్టీ నాయకులే నిలదీస్తున్నారు. అన్ని వైపుల నుంచి మల్లెల రాజేష్ నాయుడుపై వ్యతిరేకత వస్తుండటంతో అధిష్టానం పునరాలోచనలో పడిందని నేతలు చర్చించుకుంటున్నారు.
వేమురు సమన్వయకర్తను మార్చేస్తారా ?
మరోవైపు వేమూరు నియోజకవర్గానికి వరికూటి అశోక్ బాబు పేరును కూడా తిరిగి పరిశీలించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు విజయవాడ వెస్ట్ నుంచి మైనార్టీ అభ్యర్ధిని పోటీ చేయాలని వైసీపీ భావించింది. ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించిన షేక్ ఆసిఫ్ కు గెలుపు అవకాశాలు లేవని సర్వేల్లో తేలడంతో...ఆయన స్థానంలో నిమ్రా కాలేజ్ అధినేత రసూల్ ఖాన్ తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.