అన్వేషించండి

YSRCP MLCs : టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు.. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు 

Telugu Desam: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తమకు తెలిసిన నేతల ద్వారా ప్రయత్నాలను సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh: రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతోంది. శాసనసభలో ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమికి ఉంది. గత ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైసీపీ దారుణ పరాభవంతో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, వైసీపీకి శాసనమండలిలో మాత్రం బలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలంటే శాసన మండలిలో కూడా ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో అధికార కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు శాసనమండలలోనూ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పలువురు ఎమ్మెల్సీలపై టిడిపి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లు అధికారం ఉన్నప్పటికీ తమను కనీసం పట్టించుకోలేదన్న భావన చాలా మంది ఎమ్మెల్సీలలో ఉంది. అటువంటి వారంతా ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి చేర్చుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

మంత్రుల ద్వారా రాయబారం నెరపుతున్న ఎమ్మెల్సీలు.. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ కనీసం గౌరవం, గుర్తింపు దక్కకపోవడం పట్ల అవమాన భారంతో ఉన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలను పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులను కలిసి తమ ఆలోచనలను వారికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం బుధవారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉద్ధరించామన్నట్టుగా చూశారని ఓ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారంలో ఉన్నంతకాలం జగన్ తమతో ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడిన దాఖలాలు లేవని అసంతృప్త ఎమ్మెల్సీలు ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మాత్రమే జగన్ తమతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా తమ అవసరం వచ్చింది కాబట్టి పిలిచారని, అది కూడా తమ గురించి కాకుండా మండలిలో తన కోసం నిలబడాలని చెప్పినట్లు పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. 

అదే బాటలో మరింత మంది ఎమ్మెల్సీలు 

ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్సీలు తమకు తెలిసిన మంత్రుల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలు నెరపుతున్నారు. ఇదే ఆలోచనలో మరింత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. కొంతమంది టిడిపి మంత్రుల ద్వారా పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. మరి కొంతమంది వచ్చి కలుస్తామంటూ మంత్రులకు వర్తమానాన్ని పంపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన, ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎన్నికల సమయంలో ఆయా స్థానాలకు రాజీనామా చేసి పలువురు టిడిపిలో చేరారు. వీటిలో రెండు స్థానాలకు కొద్ది రోజుల కిందట అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, వైసీపీ నుంచి అభ్యర్థులెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టిడిపి నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget