అన్వేషించండి

YS Sharmila: 'ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది' - విచారణకు సిట్టింగ్ జడ్డితో కమిటీ వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్

Andhra Politcs: విశాఖలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

Ys Sharmila Sensational Comments in Visakha Drugs Issue: విశాఖలో చిక్కిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని మండిపడ్డారు. 'డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే. పదేళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే... తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయి.?. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా.?. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి.' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

'సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి'

ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లున్నా నిగ్గు తేల్చాలని సీబీఐను కోరుతున్నట్లు షర్మిల తెలిపారు. 'ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో ఓ కమిటీ వేయాలి.' అని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో శుక్రవారం కొకైన్ పట్టుబడింది. ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు చేసిన సీబీఐ అధికారులు.. మరోసారి పరీక్షలు చేయనున్నారు. మెజిస్ట్రేట్‌ ఎదుట 140 శాంపిల్స్‌ను పరీక్షించనున్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే  కంటైనర్‌లో ఉన్న స్టాక్‌ డ్రగ్స్‌ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్‌లో ఈస్ట్‌ కొనుగోలు చేశామని.. కంటైనర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని స్పష్టం చేసింది. కంటైనర్‌లో డ్రగ్స్‌ లేవని నిరూపిస్తామని పేర్కొంది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అటు, ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read: P.Gannavaram: ఆ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన - టీడీపీ నుంచి జనసేనకు పి.గన్నవరం నియోజకవర్గం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget