By: ABP Desam | Updated at : 17 Mar 2023 06:08 AM (IST)
బండి సంజయ్ కొనసాగింపు ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతోంది? హైకమాండ్ పునరాలోచిస్తోందా ?
Telangana BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ పదవి కాలం పూర్తవుతోంది. అయితే ఎన్నికలు దగ్గర పడినందున ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని.. ఆయనను కొనసాగించేందుకు హైకమాండ్ ఆసక్తితో ఉందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా ఈ విషయం ప్రకటించారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఢిల్లీ నుంచి వెలువడలేదు. దీనికి కారణం సంజయ్ విషయంలో హైకమాండ్ వద్ద సానుకూలత ఉంది కానీ.. రాష్ట్ర నేతల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే ప్రకటన ఆలస్యం అవుతోందన్న వాదన వినిపిస్తోంది.
బండి సంజయ్‌పై పెరుగుతున్న అసమ్మతి !
తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. కానీ బీజేపీలో మాత్రం నాయకత్వ సమస్యపై స్పష్టత లేకుండా పోయింది. బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే.. ఆ ఊహాగానాలకు బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెర దించేశారు. ఎన్నికల ఏడాది కావడంతో మార్పు మంచిది కాదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న బీజేపీ.. వచ్చే ఎన్నికలను బండి నాయకత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కానీ హైకమాండ్ నుంచి అసలు ప్రకటన మాత్రం ఆలస్యం అవుతోంది.
సంజయ్‌తో సీనియర్లకు ఆగాధం !
బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి మూడేళ్లు. అది పూర్తైన తర్వాత రెండోసారి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు.. మార్చి 11తో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తికానుంది. ఆయనకంటే ముందు.. అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ మూడేళ్ళు పనిచేయగా.. అంతకుముందు కిషన్‌రెడ్డి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అప్పటి నేతలు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత సంజయ్‌లా ఇమేజ్ పెంచుకోలేకపోయారు. ఈ కారణంగా సంజయ్‌కు సీనియర్ల మధ్య గ్యాప్ ప్రారంభమయింది. బండి ఒకవైపు.. సీనియర్లు మరోవైపు అనేలా పరిస్థితులున్నాయి. అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదన్న ఫిర్యాదులు హైకమాండ్ వద్దకు వెళ్లాయి. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ లాంటి నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్లు సంజయ్ విషయంలో వ్యతిరేకతతో ఉన్నారు.
వివాదాస్పదమవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు !
అయితే బండి సంజయ్ దూకుడు తరచూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కవిత విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కేసుల వరకూ వెళ్లాయి. ఇలాంటివి బీజేపీకి మైనస్‌గా మారుతున్నాయని.. ఆయన దూకుడు వల్ల పార్టీకి ఎంత లాభమో.. అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతోందన్న అభిప్రాయాన్ని సీనియర్లు వినిపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి మాదిరిగా ఉందని.. దీనికి రాష్ట్ర నాయకత్వం స్వయం కృతాపరాధాలే కారణమని వారంటున్నారు. అయితే.. మోదీ, అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ లెక్కన.. 2024 వరకు ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారని ఆయన వర్గీయులు గట్టి నమ్మకంగా ఉన్నారు.
ప్రకటన ఎదుకు ఆలస్యం అవుతోంది ?
బండి సంజయ్ కొనసాగింపును అడ్డుకోవాలని సీనియర్ నేతలు కొంత మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొనసాగింపు ఖాయమని .. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే మరింత దూకుడుగావెళ్లాలని బండి సంజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి సంజయ్‌పై అమిత్ షా, మోదీల నమ్మకం కొనసాగుతుందా ? సీనియర్ల ఒత్తిడి ఫలిస్తుందా ?
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని
Nizamabad కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత