అన్వేషించండి

TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్‌గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో

తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు విశేషాలను ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. కొత్త తరం ఆ మహానాడు ఎలా జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోతూంటారు.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహానాడు జరుపుకుంటోంది. ఆ పార్టీ ప్రతినిధుల సభను మహనాడు అని పిలుచుకుంటారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహానాడులో ఈ సారి జోష్ మరింత ఎక్కువగా ఉంది. అసలు మహానాడుకు ఆ పేరు ఎవరు పెట్టారు ? ఎప్పట్నుంచి మహానాడు జరుగుతోంది ? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.  

"మహానాడు"గా నామకరణం చేసిన ఎన్టీఆర్ ! 

టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారం చేపట్టారు. ఆ తర్వాత పార్టీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఎన్టీఆర్ మహానాడు అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు అప్పటి టీడీపీ నేతలకు చాలా విచిత్రంగా అనిపించింది. మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు.  కానీ ఎన్టీఆర్‌ను నేరుగా అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అయితే  ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత పసుపు పండుగ అని వారికి అర్థమైంది.
TDP First Mahanadu :  తొలి

తొలి మహానాడు జరిగింది గుంటూరులో !

హైదరాబాద్‌లో పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించిన ఎన్టీఆర్ మొదటి మహానాడును గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరిరోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది.   అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
TDP First Mahanadu :  తొలి

టీడీపీ తొలి మహానాడుకు జాతీయ స్థాయి దిగ్గజ నేతలు హాజరు ! 

సాధారణంగా పార్టీ సభ అంటే.. ఆ పార్టీ నేతలే హాజరవుతారు. ఇతర పార్టీల నేతలు రారు. కానీ టీడీపీ తొలి మహానాడుకు మాత్రం జాతీయ నేతలంతా హాజరయ్యారు. అప్పట్లో అగ్రనేతలుగా ఉన్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు , ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, మేనకాగాంధీ కూడా హాజరయ్యారు.  అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న అందరూ మహనాడు వేదిక మీదకు వచ్చారన్నమాట.  అంటే తొలి అడుగులోనే టీడీపీ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది.
TDP First Mahanadu :  తొలి

అతిధి మర్యాదలు కూడా అప్పట్నుంచే !

టీడీపీ మహానాడు అంటే.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఓ ప్రత్యేకమైన అనుభూతి మిగులుతుంది. ఎందుకంటే అతిథి మర్యాదలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. పసందైన వంటకాలు..  వచ్చిన వారందరికి బస ఏర్పాటు చేయడం వంటివి పార్టీ చూసుకుటుంది. తొలి మహానాడు నుంచే ఇది జరుగుతోంది.  అప్పట్లో ప్రతినిధుల కోసం ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఇలా తొలి మహానాడు అద్భుతంగా సాగిందని చెబుతూంటారు. ఆ ఒరవడితో అధికారంలో ఉన్నా లేకపోయినా... మహానాడును టీడీపీ సంబరంగా నిర్వహిస్తూ ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget