News
News
X

TDP Youth : యువత చేతుల్లోకి టీడీపీ - త్వరలో సంచలన మార్పులు ఉంటాయా ?

తెలుగుదేశం పార్టీలో యువత ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అందు కోసం కమిటీని నియమిస్తున్నారు.

FOLLOW US: 

TDP Youth :  తెలుగుదేశం పార్టీలో అన్ని విభాగాల్లో యువతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న చర్చ మరోసారి ప్రారంభమయింది. చాలా కాలంగా ఈ డిమాండ్ ఆ పార్టీలో ఉంది. అయితే ఎప్పటికప్పుడు యువ నేతలకు చాన్సులిస్తున్నారు కానీ అది చర్చించుకున్నంత స్థాయిలో ఉండటం లేదు. పొలిట్ బ్యూరో సమావేశాల్లో నారా లోకేష్ చాలా సార్లు యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నఅంశాన్ని ప్రస్తావించారు. పలు ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. లోకేశ్ సూచనల పై సమగ్ర అధ్యయనం కోసం ప్ర‌త్యేక‌ కమిటీ ఏర్పాటు కు పొలిట్ బ్యూరో నిర్ణయం కూడా తీసుకుంది. 

యువతకు ప్రాధాన్యం అంశంపై పొలిట్ బ్యూరో కమిటీ

యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై క‌మిటి నివేదిక ఇవ్వనుంది.   వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో వెళ్లాలన్న అభిప్రాయం నారా లోకేశ్ వ్య‌క్తం చేస్తున్నారు. యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వడం, పార్టీలో నూతనత్వం, యువ రక్తం ఎక్కించేందుకు కసరత్తును వేగంగా చేపట్టాలని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులో కూడ ఇదే అంశం పై నారా లోకేష్ ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. అయితే మ‌హానాడు లో ఈ అంశం పై అంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. నాయ‌కులు కూడ చాలా అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హ‌రం పై పార్టీలో అంత‌ర్గ‌తంగా పెద్ద చ‌ర్చే జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. 

నివేదిక వచ్చిన తర్వాత కీలక మార్పులు

పార్టీలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం, రాజ‌కీయాల్లోకి కొత్త వారిని తీసుకువ‌చ్చి అవ‌కాశాలు ఇచ్చి, ప్రోత్స‌హించ‌టం టీడీపీకి కొత్తేమి కాదు.  చాలా మంది కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీలోకి తీసుకురావ‌టం, వారిని నాయ‌కులుగా తీర్చిదిద్ది మంత్రులు,కేంద్ర మంత్రుల‌ను చేసిన చ‌రిత్ర కూడా టీడీపీ కి ఉంది. ఇది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండే మెద‌లైంది. అనేక మంత్రి నాయ‌కులు పార్టీలో రాజ‌కీయం నేర్చుకున్న వారే. విష‌యం పాత‌దే అయిన‌ప్ప‌టికి ఇప్పుడున్న నాయ‌కులు, వారి ఆలోచ‌న‌లు పార్టీకి కాని, ప్ర‌జ‌ల‌కు కాని స‌మాజానికి కూడా అవుట్ డేడెట్ గా భావిస్తున్నార‌నే అభిప్రాయం ఉంది. పార్టీని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌న్నా ఇప్పుడున్న ప‌రిస్దితుల్లో అంత ఈజీ కాదని భావిస్తున్నారు.  ఈ స‌మ‌స్య‌ను ఎలా ఎదుర్కొవాలనే అంశం పై చర్చ‌కు తెర‌ తీశారు.

లోకేష్ పట్టు పెంచేందుకే ప్రయత్నాలా ?
 
పార్టీ స్దాపించిన త‌రువాత ఎన్టీఆర్ కు ప్ర‌పంచ స్దాయిలో గుర్తింపు వ‌చ్చింది. తెలుగు వారు అనే వారు ఉన్నార‌ని తెలిసింది కూడ టీడీపీతోనే మెద‌లైంది.ఆ త‌రువాత దాన్ని చంద్ర‌బాబు భారీ స్దాయిలో కొన‌సాగించారు. పార్టీకి హైప్ తీసుకురావడంతో  పాటు ప్రపంచంలోని తెలుగు వారిని సైతం ఎకం చేసిన ఘ‌న‌త కూడా టీడీపీదే.  అ లోకేష్ ను ఫుల్ పొలిటిషియ‌న్ గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌న్నా,టీడీపీని  మ‌రింత ఉత్సాహంగా న‌డిపించాల‌న్నా లోకేష్ మార్క్ రాజ‌కీయం కావాలి, కాబ‌ట్టి దాన్ని కేంద్రంగా చేసుకొనే యువ‌త‌కు ప్రాదాన్య‌త ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే టీడీపీలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

Published at : 09 Aug 2022 08:19 PM (IST) Tags: Telugu Youth tdp Nara Lokesh Telugu Desam Place for Youth in TDP

సంబంధిత కథనాలు

Revanth Reddy: కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు, వారి విధానం అదే - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు, వారి విధానం అదే - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

APCID Controversy : ఏపీసీఐడీ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడానికేనా ? ఎన్ని విమర్శలొస్తున్నా ఎందుకు మారడం లేదు ?

APCID Controversy :  ఏపీసీఐడీ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడానికేనా ? ఎన్ని విమర్శలొస్తున్నా ఎందుకు మారడం లేదు ?

KCR National Politics : దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !

KCR National Politics :  దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన -  అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా