News
News
X

Karnataka Telugu Voters : కర్ణాటకలో తెలుగు ఓటర్లే విజేత నిర్ణేతలు - వారి కోసం పార్టీలు ఏం చేస్తున్నాయో తెలుసా ?

కర్ణాటకలో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి ఓట్లే గెలుపోటముల్లో కీలకం కావడమే దీనికి కారణం.

FOLLOW US: 
Share:

Karnataka Telugu Voters  : కర్ణాటక ఎన్నికల్లో తెలుగు మూలాలున్న ఓటర్లు కీలకంగా మారారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిరపడిన వారు కాకుండా తరతరాలుగా కర్ణాటక స్థిరపడిన  తెలుగు మూలాలు ఉన్న వారు కూడా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లు గెలుపోటముల్ని నిర్దేశించబోతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు ఓటర్లపై పక్రత్యేక దృష్టి పెట్టాయి. తెలుగు రా,్ట్రాల నుంచి నేతల్ని ప్రచారానికి పిలవడంతో పాటు సామాజికవర్గ సమీకరణాల్ని చూసుకుంటూ నేతల ప్రచార షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మెజార్టీకి అవసరమైన ఓట్లు తెలుగు ఓటర్లు ఇస్తారని నమ్మడంతో ఈ సారి  అన్ని పార్టీలు తెలుగు ఓటర్లుపై ఎక్కువ దృష్టి పెట్టాయి.

దాదాపుగా 60 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయనున్న తెలుగుఓటర్లు

కర్ణాటక లో 224 అసెంబ్లి సీట్లుండగా ఏడు జిల్లాల్లోని దాదాపు 60 స్థానాల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు 60 శాతానికి పైగా ఉన్నట్టు చెబుతున్నారు.  కోలార్‌ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లు తెలుగు మూలాలు ఉన్న వారేనని భావిస్తున్నారు.  బెంగళూర్‌ రూరల్‌ జిల్లాలోని నాలుగు జిల్లాలో 65 శాతం, బెంగళూర్‌ అర్బన్‌ జిల్లాలోని 28 నియోజక వర్గాల్లో 49 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లున్నారు. రాయచూర్‌ జిల్లాలో ఏడు సీట్లలో 64 శాతం, బళ్లారిలో 9 అసెంబ్లి సీట్లలో 63 శాతం, చిక్‌ బల్లాపూర్‌ జిల్లాలో 5 సీట్లలో 49 శాతం కొప్పల్‌ జిల్లాలో 5 అసెంబ్లి సీట్లలో 43 శాతం తెలుగు ఓటర్లున్నారని రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఇక తెలంగాణలోని జహీరాబాద్‌కు పొరుగున ఉన్న బీదర్‌ నియోజక వర్గంలో ఉన్న ఓటర్లలో 20 శాతం మంది సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే.  వీరి ఓట్లు కీలకం కానున్నాయి. 

తెలుగు నేతల్ని ప్రచారంలోకి దింపుతున్న రాజకీయ పార్టీలు 
 
తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ , జనతాదళ్‌సెక్యులర్  పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  తెలుగు మాట్లాడే ఓటర్ల నియోజకవర్గాలను గుర్తించి అక్కడ తెలుగు వారిని  ... పలుకుబడి ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేసి వారితో నామినేషన్లు వేయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో తెలుగు మాట్లాడే నేతలకు డిమాండ్‌ బాగా పెరిగినట్లయింది.    తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను ప్రచార బరిలోకి దింపాయి. జనతాదళ్‌ సెక్యులర్‌ తరపున భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రచారం నిర్వహస్తారని చెబుతున్నారు. అయితే ఇంకా ఖరారు కాలేదు.   తెలంగాణకు పొరుగున ఉన్న గుల్బర్గా,రాయచూర్‌,కొప్పోల్‌,బీదర్‌ తో పాటు బెంగళూర్‌ అర్బన్‌ లో నిర్వహంచే ప్రచార సభలు, రోడ్‌ షోలలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
   
సినీ తారల్ని రంగంలోకి దించే ప్రయత్నాల్లో రాజకీయ పార్టీలు

తెలుగువారిని ఆకట్టుకోవడానికి టాలీవుడ్ తారల్ని రంగంలోకి దించాలనే ఆలోచన కొన్ని పార్టీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో ప్రచారం చివరి రెండు, మూడు రోజులు సభలు, రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు ప్రజలకు బాగా గుర్తుండే కన్నడ నటులతో ప్రచారం చేయించాలనుకుంటున్నారు. మొత్తంగా తెలుగు ఓటర్లు అందరూ ఎటు వైపునిలబడితే అటు వైపు విజయం ఉంటుందన్న ప్రచారం అయితే సాగుతోంది. 
 
Published at : 22 Apr 2023 06:23 AM (IST) Tags: Karnataka Elections Telugu Voters Karnataka Political Parties

సంబంధిత కథనాలు

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Chandrababu : చంద్రబాబు పేరు చెబితే పథకాలు గుర్తుకు రావా ? స్కీమ్స్ వైఎస్ఆర్‌సీపీ సొంతమేనా ?

Chandrababu  :  చంద్రబాబు పేరు చెబితే పథకాలు గుర్తుకు రావా  ?   స్కీమ్స్ వైఎస్ఆర్‌సీపీ సొంతమేనా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

టాప్ స్టోరీస్

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?