By: ABP Desam | Updated at : 03 Feb 2022 01:54 PM (IST)
రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలపై విపక్షాల నిరసనలు
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నిరసన దీక్షలు చేపట్టాయి. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో రాజ్ ఘాట్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష చేపట్టారు. కేసీఆర్‌కు ఎందుకు ఇంత అహంకారమని సంజయ్ ప్రశ్నించారు. తప్పు చేసి సమర్థించుకునేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాన్య వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారంటే.. అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే అని ..ప్రధాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు.
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో "బిజెపి భీం దీక్ష" చేయడం జరిగింది.ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈవిషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టేది లేదు. pic.twitter.com/TU0RRtoGo0
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 3, 2022
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకొద్దు, నేనే రాజ్యాంగం రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అన్నట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. తనను ఎవరూ ప్రశ్నించవద్దు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయవద్దు అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయక పోవడానికి కారణం కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు. నేడు రాజ్యాంగం మార్చాలి అన్నాడు. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలని అంటారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘‘బిజెపి భీమ్ దీక్ష’’#KCRInsultsConstitution pic.twitter.com/9bZFoFd6ov
— BJP Telangana (@BJP4Telangana) February 3, 2022
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుు ఈ దీక్షలు చేపట్టాయి. బండి సంజయ్ దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘిభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ దీక్షలు చేస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగం రద్దు మాటలు ఉపసంహరించుకోవాలంటూ రెండు రోజులపాటు గాంధీ భవన్‌లో నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు.
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని ..దీనిపై చర్చ జరగాలని కేసీఆర్ రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సరిగా లేదని .. అందరికీ అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన... దేశానికి కొత్త నాయకత్వం కావాలన్నారు. అందులో భాగంగా రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు చేశారు. అయితే అది రాజకీయ దుమారంగా మారింది.
Revant Reddy : కేసిఆర్ చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
US Formula Milk Shortage : అమెరికాలో ఫార్ములా మిల్క్ కొరత - ఎక్కడ చూసినా నో స్టాక్ !