అన్వేషించండి

ఏపీలో మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి- పవన్ ఆశాభావం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయలపై జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు, సీఎం అభ్యర్థి అంశంపై కూడా జాతీయ మీడియాతో మాట్లాడారు.

ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు పవన్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇది ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ పని తీరుపై క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తి ఉందన్న పవన్... మీడియాలో చెప్పిందానికి భిన్నంగా ఉందన్నారు. అవి వైసీపీని షేక్ చేస్తున్నాయన్నారు. పెచ్చుమీరిపోయిన అవినీతి మరో కారణంగా చెప్పారు. డేటా బ్రీచ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. 

ఆధార్‌ లాంటి వ్యక్తిగత డేటా ఎందుకు ఇవ్వాలని పోరాడుతున్న టైంలో ఆ డేటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోందన్నారు. నెలకు ఐదు వేల కోసం వైసీపీ రిక్రూట్ చేసుకున్న వ్యక్తులు దీన్ని సేకరిస్తున్నారని తెలిపారు. రోజుకు 164.33 రూపాయలు వాళ్లకు ఇస్తున్నారని. ప్రతి వ్యక్తి ఐరిష్‌, ఆధార్, బ్యాంక్ అకౌంట్స్ లాంటి సెన్సిటివ్‌ డేటాను వేర్వేరు ప్రాంతాల్లో స్టోర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజల్లో ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేస్తోందని... అదే టైంలో లా అండ్‌ ఆర్డర్ ఇష్యూ కూడా ప్రధానమైందన్నారు. మౌలిక వసతులు పూర్తిగా లేవని, రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు. . ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదు. కాంట్రాక్టర్లు పనులు చేయడానికి నిరాకరిస్తున్నారు. వాళ్లకు చేసిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదని...వివిధ సంస్థల నుంచి 10 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలా రాష్ట్రాన్ని ఎన్నో రోజులు నడపలేరని... ఇలాంటివి ప్రశ్నించడానికి ఎవరో ఒకరు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వారికి జనసేన అండగా నిలబడుతోంది. ఎంత వరకు వెళ్లాలంటే అంత వరకు వెళ్తాం. 

వైసీపీ వ్యతిరేక ఓటు చీలికపోకూడదనేది జనసేన చెబుతున్న మాట. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో 2014లో కలిసి పోటీ చేశాం. తర్వాత మారిన పరిణామాలతో విడిపోయాం. అయితే 2019 మళ్లీ బీజేపీ, జనసేన కలిశాయి. అయితే టీడీపీ, బీజేపీ మధ్య అండర్‌స్టాడింగ్ ఇష్యూ ఉంది. వాళ్ల సమస్య గురించి నేను మాట్లాడలేను. కానీ కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని అనుకుంటున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.  
సీఎం ఎవరు అనేది సమస్య కానే కాదన్నారు పవన్. ఈ ప్రశ్న వచ్చినప్పుడు మా వాళ్లు నన్ను సీఎంగా చూడాలని అనుకుంటారు. కానీ గ్రౌండ్‌ లెవల్‌లో ఉన్న పార్టీ బలాబలాలు ప్రస్తావనకు వస్తాయి. ఎన్నికల నాటికి వాటిపై క్లారిటీ వస్తుంది. కానీ మా మొదటి ప్రయార్టి మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ఓ హోప్ కావాలి. ప్రజలకు స్టేబుల్‌ గవర్నర్‌మెంట్‌ అందివ్వడం ముఖ్యం. దానిపైనే వర్క్ చేస్తున్నామని తెలిపారు. 

తాను ఎన్డీఏ మీటింగ్‌కు హాజరుకావడం మొదటిసారి కాదని... గతంలో కూడా హాజరైనట్టు గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు అగ్రపథాన్ని నిలబెట్టేందుకు ఎన్డీఏకు మరోసారి అవకాశం ఇవ్వాలని అన్నారు పవన్ కల్యాణ్‌. దేశాన్ని అభివృద్ధి పథంలో ఎలా చూడాలని అనుకుంటున్నామో అది సఫలీకృతం కావాలంటే అవకాశం ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి తీసుకురావడంపైనే ఈ మీటింగ్‌లో చర్చలు ఉంటాయన్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget