అన్వేషించండి

Telangana Elections : ద్వితీయ శ్రేణి నేతలకు ఎలక్షన్ ఆఫర్స్ - అటూ ఇటూ మరిపోతున్న నేతలు !

తెలంగాణలో ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. అందుకే ప్రతీ రోజూ అన్ని పార్టీల ఆఫీసుల్లో సందడి కనిపిస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ముందే వీరు ప్రయోజనాలు పొందుతున్నారు.

 

Telangana Elections : ఎన్నికల్లో ప్రచారాలు, హామీలు ఎలా ఉన్నా ప్రజలను పోలింగ్ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓటు వేయించేది మాత్రం ఈ సెకండ్‌ లెవల్‌ నేతలే. ఎలక్షనీరింగ్‌లో వీరిది కీలక పాత్ర అందుకే వారిని కలుపుకొని వెళ్లాలని ఈ మధ్య పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.  వారిని మచ్చిక చేసుకోవాలన్నారు. కొందరు అలుగుతారని అలాంటి వారితో మాట్లాడి ప్రచారం చేయించాలన్నారు. ఈగోకు పోతే అసలుకే మోసం అవుతుందని హెచ్చరించారు.   అందుకే బీఆర్ఎస్ నేతలు  పాత వారిని బుజ్జగిస్తూ కొత్త వారిని చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. 
 
ద్వితీయ శ్రేణి నేతల్ని కాపాడుకోవడం.. ఇతర నేతల్ని చేర్చుకోవడానికి ప్రయత్నాలు 
 
టికెట్ దక్కించుకున్న అధికార పార్టీ నేతలు ప్రత్యర్థుల బలబలాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మండలాలు, గ్రామాల వారీగా ఆయా పార్టీల్లో బలమైన నాయకులు ఎవరు..? వారి బలహీనతలు ఏమిటి..? వారు పార్టీ ఫిరాయిస్తే గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే అంశాలపై బేరీజు వేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలతో బేరసారాలకు దిగుతున్నారు. గ్రామ, మండలస్థాయి నేతలకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు నజరానాలు వెనుకాడటం లేదు. కొంచెం పలుకుబడి, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు పది నుంచి 20 లక్షలు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. నగదుతో పార్టీల్లోకి వచ్చిన తర్వాత పదవులు కట్టబెడతామని హామీలు ఇస్తున్నారు. 

బంపర్ ఆఫర్లు ఇస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
 
ఎన్నికలకు అన్ని రాజకీయపార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డా తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశంతో ఉన్న వారిపై కాంగ్రెస్‌ పార్టీ కన్నేసినట్లు సమాచారం. ఒక్కో నేతకు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇచ్చి వారి సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ద్వితీయశ్రేణి నేతలు అడిగినవన్నీ చేసేందుకు వెనుకాడటం లేదు.

సొంత నేతలకూ తాయిలిచ్చుకోవాల్సిన పరిస్థితి !
 
తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు తమ నుంచి జారిపోకుండా ఆయా పార్టీల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. వారిని మచ్చిక చేసుకుని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పిస్తామని, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో కొనసాగే విధంగా ఆయా పార్టీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ బలం పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఇస్తున్న బంపర్ ఆఫర్లతో ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇదే సందనుకుని కోరికలు తీర్చేసుకుంటున్నారు.  పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే చేయించుకుంటున్నారు.  వీరంతా ఎన్నికల్లో ఎవరి తరపున పని చేస్తారో కానీ అభ్యర్థులకు మాత్రం చేతి చమురు బాగానే వదులుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget