అన్వేషించండి

Pawan Kalyan News: పవన్‌ ఢిల్లీ టూర్‌ మరి లేనట్టేనా..? జనసేనాని వ్యూహమేంటి.?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. షెడ్యూల్‌ ఇప్పటి వరకు విడుదల కాలేదు.

Janasenani Pawan Kalyan Delhi Tour : రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లాలన్నది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బలమైన ఆకాంక్ష. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన ఇదే మాటను చెప్పారు. బీజేపీ పెద్దలతో తాను మాట్లాడుతున్నాని, పొత్తు కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి అటువంటి ప్రకటన ఎప్పుడూ రాలేదు. కానీ, పవన్‌ కల్యాణ్‌ మాత్రం పదే పదే చెబుతూ వచ్చారు.

వారం రోజులు నుంచి పవన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. పొత్తుపై స్పష్టత వచ్చిందని, సీట్ల సర్ధుబాటుపై చర్చలకు పవన్‌, ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది. రోజులు గడుస్తున్నాయి. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు సంబంధిన షెడ్యూల్‌ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పట్లో ఢిల్లీ పర్యటన ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకుల అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడం వల్లే పవన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం లేదా..? పొత్తుపై సానుకూల నిర్ణయం రాకపోవడం వల్లే ఆయన వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. 

ఆ సీట్లపై కూటమికి స్పష్టత

టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులుగా పోటీ చేయబోయే ఎంపీ స్థానాలపై ఒక స్పష్టతకు ఇరు పార్టీలు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై టీడీకి అనుకూలంగా వ్యవహరించే ప్రధాన మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ, బీజేపీతో పొత్తు లేకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. బీజేపీ ముందుకు రాకపోవడం వల్లే ఇరు పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇరు పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చిన తరువాతే ఈ మేరకు నిర్ణయాన్ని కూటమి తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే కూటమి ఈ నిర్ణయాన్ని తీసుకుందన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. మరి దీనిపై బీజేపీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి. 

అభ్యర్థుల ప్రకటనపై కీలక చర్చలు

జనసేన పార్టీకి మచిలీపట్న, కాకినాడ పార్లమెంట్‌ స్థానాలను టీడీపీ కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని సీట్లను జనసేన కోరుతోంది. అలాగే, అసెంబ్లీ స్థానాలపై ఇరు పార్లీ మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ ఇప్పటికే కొన్ని సార్లు కలిసి చర్చించారు. కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీల నుంచి ముఖ్యమైన నాయకులు పోటీలో ఉండడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించుకునే పనిలో ఇరు పార్టీలు ఉన్నాయి. జనసేన పార్టీ మాత్రం వచ్చే ఎన్నికలకు ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది, అంగ, అర్ధబలం ఉన్న నేతలపై జనసేన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కనీస స్థాయిలో ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా పవన్‌ కల్యాణ్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget