అన్వేషించండి
Advertisement

BJP Manifesto Highlights: ఐదేళ్లు ఉచిత రేషన్, ముద్ర లోన్ రూ.20 లక్షలకు పెంపు - బీజేపీ మేనిఫెస్టో 2024 హైలైట్స్ ఇవీ
BJP Election Manifesto 2024 Highlights: మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 14 అంశాలతో రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో మేనిఫెస్టోను రూపొందించారు.

ఐదేళ్లు ఉచిత రేషన్, ముద్ర లోన్స్ రూ.20 లక్షలకు పెంపు - బీజేపీ మేనిఫెస్టో 2024 హైలైట్స్
1/8

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు గానూ భారతీయ జనతా పార్టీ కీలకమైన నాలుగు అంశాల ఆధారంగా మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను తయారు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అన్నదాత, నారీశక్తి గరీబ్, యువశక్తిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది.
2/8

మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు.
3/8

మరో ఐదేళ్లు దేశ వ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందించనున్నారు. అర్హులైన పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టి, లబ్ధిదారులకు అందజేయం. పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ అందించాలని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
4/8

దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రస్తుతం అందిస్తున్న ముద్ర రుణాల గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
5/8

డెయిరీ సహకార సంఘాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుతామన్న బీజేపీ. దాంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంలో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికలు తీసుకువస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. కూరగాయల సాగు, నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
6/8

ఆయుష్మాన్ భారత్ లో భాగంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ట్రాన్స్ జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ సౌకర్యం కల్పించనున్నారు.
7/8

వ్యవసాయ మౌలికవసతుల మిషన్ ప్రారంభిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపుతో పాటు చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహించనున్నారు. సేవారంగంతో స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేస్తామన్నారు.
8/8

వందే భారత్ విస్తరణ, విమానయాన రంగానికి ఊతం, రక్షణ, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం. విద్యుత్తు వాహన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పోత్సహిస్తామని మేనిఫేస్టోలో చేర్చారు. ( Image Source :PTI )
Published at : 14 Apr 2024 04:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement