అన్వేషించండి
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, వచ్చిన అతిథులు వీళ్లే
Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రముఖులు తరలి వచ్చి సందడి చేస్తున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రముఖులు తరలి వచ్చి సందడి చేస్తున్నారు.
1/9

జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబానీల హోదాకి తగ్గట్టుగా కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.
2/9

ఈ ఈవెంట్‌లో రాధికా మర్చెంట్ డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పింక్ కలర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో మెరిశారు రాధికా. హాలీవుడ్ నటి బ్లేక్ లివ్‌లీ మెట్ గాలా ఈవెంట్‌లో ఇలాంటి డ్రెస్‌లోనే కనిపించారు. అదే డిజైన్‌తో ఇలా తయారు చేయించుకున్నారు రాధికా మర్చెంట్.
3/9

ఫ్యామిలీ ఫొటోలతోనూ అలరించింది అంబానీ కుటుంబం. రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో కలిసి ఫొటో దిగారు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ. కొడుకు కోడలితో పాటు మనవడూ ఈ ఫొటోలకి ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
4/9

నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్‌లో మెరూన్ కలర్ డ్రెస్‌లో కనిపించారు. అతిథులను పలకరించడమే కాదు. వాళ్లని ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు నీతా అంబానీ. మన సంస్కృతిని అందరికీ గుర్తు చేయడంతో పాటు భారతీయ కళలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ పెట్టినట్టు చెప్పారు.
5/9

ఈ ఈవెంట్‌కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆమెని సాదరంగా స్వాగతించిన నీతా అంబానీ కాసేపు ముచ్చటించారు. భర్త జరేద్ కుషీర్, కూతురితో పాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇవాంకా ట్రంప్.
6/9

అమెరికా నుంచి వచ్చిన పాప్ సింగర్ రిహానా షో ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది. రిలయన్స్ గ్రీన్స్‌లో ప్రదర్శన ఇచ్చి అందరినీ అలరించారు. ఈ షో కోసం అంబానీ నుంచి ఆమె రూ.52 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. జామ్‌నగర్‌లోని ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆమె తెచ్చుకున్న లగేజ్‌పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి.
7/9

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు.
8/9

కేవలం సినీ, రాజకీయ ప్రముఖులే కాదు. క్రీడా రంగంలోని ప్రముఖులూ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ డ్వెయిన్ బ్రావో తన భార్యతో కలిసి హాజరయ్యారు.
9/9

ఇక ఈవెంట్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్ కేప్టెన్ కూల్ ఎమ్ ఎస్ ధోనీ. తన భార్య సాక్షితో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ధోనీ బ్లాక్ సూట్‌లో మెరిసిపోగా...సాక్షి బ్లాక్ కలర్ శారీలో తళుక్కుమన్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
Published at : 02 Mar 2024 01:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion