అన్వేషించండి
Neethone Dance 2.0 Runner Up: అప్పుడు బిగ్ బాస్ పోయే, ఇప్పుడు 'నీతోనే డ్యాన్స్ 2.0' - విశ్వ, పవని జోడీకి బ్యాడ్ లక్
Nayani Pavani and Vishwa finished in second place in Neethone Dance 2.0: యూట్యూబర్ కమ్ డ్యాన్సర్ నయని పవనితో పాటు నటుడు విశ్వకు మరోసారి నిరాశ ఎదురైంది. 'నీతోనే డ్యాన్స్ 2.0'లో బ్యాడ్ లక్ వెంటాడింది.

'నీతోనే డ్యాన్స్ 2.0' రన్నరప్ జోడీ విశ్వ, నయని పవని... 'బిగ్ బాస్' తర్వాత వీళ్లకు మరొకసారి అన్యాయం జరిగిందా? (Image Courtesy: vishwaactor_official / Instagram)
1/6

'నీతోనే డ్యాన్స్ 2.0' డాన్స్ రియాలిటీ షోలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జోడీ విజేతగా నిలిచింది. మరి, రెండో స్థానంలో ఎవరు ఉన్నారో తెలుసా? నటుడు విశ్వ అలియాస్ విశ్వేశ్వర్ ఆకుల, యూట్యూబర్ కమ్ డ్యాన్సర్ నయని పవని రాజు. ఈ జోడీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. (Image Courtesy: vishwaactor_official / Instagram)
2/6

'బిగ్ బాస్'లో ఒకసారి... ఇప్పుడు 'నీతోనే డ్యాన్స్ 2.0'లో మరొకసారి... విశ్వ, నయని పవని రాజును బ్యాడ్ లక్ వెంటాడింది. వాళ్లిద్దరి ఆట పాట ఎంతో మందిని మెప్పించింది. కానీ, విజేతలుగా నిలపడంలో సక్సెస్ కాలేదు. షో మొదటి నుంచి వీళ్లిద్దరూ ఉన్నారు. మధ్యలో వచ్చిన అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంటకు కప్ రావడంతో వీళ్లిద్దరి అభిమానులు నిరాశలో ఉన్నారు. (Image Courtesy: vishwaactor_official / Instagram)
3/6

విశ్వ, నయని పవని రాజు... ఇద్దరూ బిగ్ బాస్ ఇంటికి వెళ్లారు. అయితే... ఈ ఇద్దరూ పార్టిసిపేట్ చేసింది ఒక్క సీజన్‌లో కాదు. 'బిగ్ బాస్ 5'లో విశ్వ సందడి చేస్తే... 'బిగ్ బాస్ 7'లో నయని సందడి చేసింది. 'బిగ్ బాస్' షో నుంచి 63వ రోజు విశ్వ బయటకు వచ్చాడు. అతడికి 11వ స్థానం. నయని పవని అయితే ఒక్క వారంలో రావడం ఎంతో మందికి షాక్ ఇచ్చింది. (Image Courtesy: vishwaactor_official / Instagram)
4/6

'నీతోనే డ్యాన్స్ 2.0' స్టార్ట్ చేసినప్పుడు విశ్వ జోడీగా యాంకర్ అండ్ 'బిగ్ బాస్' ఫేమ్ నేహా చౌదరి చేసింది. కొన్ని రోజుల తర్వాత నేహా షో నుంచి వెళ్లిపోగా... ఆవిడ బదులు విశ్వ జోడీగా నయని పవని రాజు వచ్చింది. మొదట ఆవిడ ప్రిన్స్ యావర్ జోడీగా షోలో ఎంటర్ అయ్యింది. నయని ఇటు రావడంతో ఆవిడ బదులు యావర్ జోడీగా వాసంతి చేసింది. (Image Courtesy: vishwaactor_official / Instagram)
5/6

'నీతోనే డ్యాన్స్' మొదటి సీజన్‌లోనూ అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట పార్టిసిపేట్ చేసింది. కానీ, అందులో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఏకంగా కప్ కొట్టింది. అందుకు వాళ్లకు 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. (Image Courtesy: vishwaactor_official / Instagram)
6/6

'నీతోనే డ్యాన్స్ 2.0' కప్ కొట్టలేకపోయినా... నయని, విశ్వ జోడీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. (Image Courtesy: vishwaactor_official / Instagram)
Published at : 24 Jun 2024 10:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion