అన్వేషించండి
Advertisement

Balakrishna: బాలకృష్ణకు టాలీవుడ్ పెద్దల అభినందన - రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ విజయాల పట్ల సంతోషం
Tollywood King Pins Met Balakrishna: హిందూపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను టాలీవుడ్ పెద్దలు కలిశారు. ఆయనకు అభినందలు తెలిపారు.

బాలకృష్ణతో దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్
1/4

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన ఎన్నో అద్భుతమైన, బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. చిత్రసీమకు ఎంతో సేవ చేశారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ఆరోగ్య పరమైన సేవ కూడా చేస్తున్నారు.
2/4

ఒకవైపు సినిమాలు, మరోవైపు బసవతారకం ఆస్పత్రి, ఇంకో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు... ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ. ఈ మధ్య జరిగిన ఏపీ ఎన్నికల్లో హిందూపూర్ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవల సినిమాల్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ, అటు రాజకీయాల్లోనూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసి పీపుల్ లీడర్ అనిపించుకున్నారు.
3/4

హీరోగా, ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తున్న బాలకృష్ణను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కెఎల్ దామోదర్ ప్రసాద్ (వాణిజ్య మండలి కార్యదర్శి కూడా), కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ (వాణిజ్య మండలి కోశాధికారి కూడా), తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు... ఈయన నిర్మాతల మండలి ఈసీ మెంబర్ కూడా) తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి కలిశారు. బాలకృష్ణకు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
4/4

బాలకృష్ణను కలిసిన వారిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి కూడా ఉన్నారు. చిత్రసీమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని బాలకృష్ణ చెప్పినట్టు సమాచారం.
Published at : 20 Jun 2024 04:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement