అన్వేషించండి
Danger Boys: తెలుగులోకి కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్... 'దండుపాళ్యం'లా 'డేంజర్ బాయ్స్' సక్సెస్ అవుతుందా?
కన్నడలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్యం విజయం సాధించడంతో పాటు వసూళ్లు కురిపించిన సినిమా 'అపాయవీడి హెచ్చరిక'. ఇదొక హారర్ థ్రిల్లర్. ఇప్పుడీ సినిమాను తెలుగులోకి 'డేంజర్ బాయ్స్'గా తీసుకొస్తున్నారు.
తెలుగులోకి కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్... 'దండుపాళ్యం'లా 'డేంజర్ బాయ్స్' సక్సెస్ అవుతుందా?
1/4

కన్నడనాట అనూహ్య విజయం సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించిన హారర్ థ్రిల్లర్ 'అపాయవీడి హెచ్చరిక'. ఇప్పుడీ సినిమాను 'డేంజర్ బాయ్స్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
2/4

'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. సినిమా ఫస్ట్ లుక్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డా ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేయగా... దర్శక నిర్మాత డా లయన్ సాయి వెంకట్ టీజర్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సత్యవర్ధన్ కలిసి పాటలు విడుదల చేశారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ట్రైలర్ ఆవిష్కరించారు.
Published at : 02 Jun 2025 05:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















