అన్వేషించండి
Apsara Rani: అప్సర... పరుచూరి క్లాప్‌తో కొత్త సినిమా షురూ, హీరో ఎవరంటే?
Thrigun to romance Apsara Rani in new film: గ్లామర్ గాళ్ అప్సరా రాణి కథానాయికగా కొత్త సినిమా మొదలైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా వివరాలు ఏమిటంటే?
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌తో అప్సరా రాణి కొత్త సినిమా మొదలైంది. అందులో హీరో ఎవరు? ప్రారంభోత్సవంలో దర్శక హీరోయిన్లు ఏం చెప్పారు? అనేది చూస్తే...
1/7

గ్లామర్ గాళ్ అప్సరా రాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. అయితే... ఆవిడ హీరోయిన్ కూడా! అప్సరా రాణి కథానాయికగా కొత్త సినిమా మొదలైంది. ఆ వివరాలు ఏమిటంటే?
2/7

త్రిగుణ్ హీరోగా వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రై.లి. పతాకంపై కృష్ణబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో అప్సరా రాణి హీరోయిన్. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో నల్లా శ్రీదేవి నిర్మిస్తున్న చిత్రమిది. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అప్సరా రాణి మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించగా... ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published at : 21 Mar 2024 08:37 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















