అన్వేషించండి
Chandrababu Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు - మెమెరబుల్ మూమెంట్స్ చూశారా!
Chandrababu Oath Ceremony: ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని మధుర క్షణాలు చూస్తే..!

చంద్రబాబు ప్రమాణస్వీకారంలో మధుర ఘట్టాలు
1/17

'చంద్రబాబు అనే నేను..'.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.
2/17

సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. ఆయనతో సరదాగా ముచ్చటించారు.
3/17

ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు.
4/17

ఈ సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
5/17

ప్రధాని మోదీకి వెంకటేశ్వరుని ప్రతిమను అందించిన సీఎం చంద్రబాబు, జనసేనాని, మంత్రి పవన్ కల్యాణ్
6/17

రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కూటమి శ్రేణుల నినాదాలతో సభ మార్మోగిపోయింది.
7/17

ప్రధాని మోదీకి పవన్, చంద్రబాబు ఆత్మీయ సత్కారం. ఈ సందర్భంగా వారు సరదా సంభాషణతో నవ్వులు పూశాయి.
8/17

మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వచనం అందుకున్నారు.
9/17

పవన్ ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ఆయన భార్య అన్నా లెజీనోవా ఆనందంతో తన ఫోన్‌లో బంధించారు.
10/17

తన తమ్ముడు పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.
11/17

మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.
12/17

చూడు నాన్నా.. నాన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రిగా లోకేశ్ ప్రమాణం సందర్భంగా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
13/17

మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం లోకేశ్ సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
14/17

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాళ్లకు మంత్రి లోకేశ్ నమస్కారం చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇతర ప్రముఖులను సైతం ఆప్యాయంగా పలుకరించి అభివాదం చేశారు.
15/17

తన మామయ్య బాలకృష్ణ కాళ్లకు మంత్రి లోకేశ్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
16/17

సభా వేదికపై బాలకృష్ణ తన సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆప్యాయంగా పలుకరించి నుదిటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టారు.
17/17

సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీతో ఏపీ మంత్రి వర్గం ఫోటో దిగింది. అనంతరం మోదీ వేదికపై అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలుకరించారు.
Published at : 12 Jun 2024 03:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion