అన్వేషించండి
TDP Manifesto 2024: ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024 - సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన
Andhra Election 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు విడుదల చేశారు.
ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024
1/6

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రజాగళం మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించగా, మరిన్ని జోడించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
2/6

మేనిఫెస్టోలో హైలైట్ సూపర్ సిక్స్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం. ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59 సం వరకు). ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించడం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ 2.0 / షణ్ముఖ వ్యూహం ఇంటింటికీ రక్షిత తాగునీరు: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (14) పథకాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సిన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచడం. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉండటం
Published at : 30 Apr 2024 06:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















