By: ABP Desam | Updated at : 02 Aug 2021 07:33 PM (IST)
పోలవరం ఫైల్ ఫోటో
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం కోసం పెండింగ్‌లో లేదని కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సవరించిన అంచనాలకు సంబంధించిన డీపీఆర్ పెండింగ్‌లో ఉందా అని జలశక్తి శాఖను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 2011లో ఆ తర్వాత 19లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని జలశక్తి శాఖ తెలిపింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించిన డీపీఆర్‌ను సమర్పించలేదని షేకావాత్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం రూ. 54 వేల కోట్లు అవుతోందని.. దాన్ని ఆమోదించాలని చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిని ప్రత్యేకంగా కలిసి.. ఈ విషయాన్ని గుర్తు చేశఆరు. సవరించిన అంచనాలను ఆమోదించామని... ఆర్థికశాఖకు పంపుతామని కేంద్రమంత్రి తెలిపారని ఎంపీలు మీడియా సమవేశంలో కూడా చెప్పారు. అయినా ఆ తర్వాత ప్రశ్న అడిగారు.
పెరిగిన అంచానాలను 2011లో ఓ సారి... రూ. 10, 154 కోట్లకు ఆమోదించామని.. అలాగో మరోసారి 2019లోనే ఆమోదించామని చెప్పారు. నిజానికి కేంద్ర జలశక్తి శాఖ 2019లోనేసవరించిన అంచనాలు రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ ఆర్థికశాఖ మాత్రమే అంగీకరించడం లేదు. 2013-14 అంచనాల ప్రకారం అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని చెబుతోంది. అంటే రూ. 20, 389 కోట్లే ఇస్తామని చెబుతోంది. ఇప్పటి వరకూ ఇచ్చిన వాటిని తీసేస్త ఇక ఇవ్వాల్సింది రూ. ఏడు వేల కోట్లే ఉంటుందని చెబుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పదే పదే ప్రశ్నలుఅడిగినా... 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం సమాధానం ఇస్తోంది. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న ద్వారా పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు గానీ, సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు గా నీ కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విషయంలోనే కాకుండా డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణంలో డిజైన్‌ల మార్పులను కేంద్ర జల సంఘం ఆమోదిస్తే తప్ప పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణలోనికి రాదని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
Uddhav Thackeray Resigns: ఉద్దవ్ ఠాక్రే రాజీనామా- కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం- ఫ్లోర్ టెస్ట్‌కు ముందే కీలక పరిణామం
Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్!
Breaking News Live Telugu Updates: కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం
Maharashtra Floor Test: మహారాష్ట్రలో గురువారమే బలపరీక్ష - గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
Maharastra Political Crisis : రాజీనామాకే ఉద్దవ్ మొగ్గు ? - కేబినెట్ భేటీలో సంకేతాలిచ్చారా ?
Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !
Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?
Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!
GST Rate Increase: ప్యాక్ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!