Oldest Man To Go To Space: విలియం శాట్నర్ సరికొత్త చరిత్ర.. అంతరిక్షంలోకి వెళ్లిన అతిపెద్ద వయస్కుడిగా నటుడు రికార్డ్
స్టార్ ట్రెక్ ఒరిజినల్ సిరీస్‌లో కెప్టెన్ కర్క్ పాత్ర పోషించిన నటుడు శాట్నర్ సరికొత్త చరిత్ర లిఖించారు. స్పేస్‌లోకి వెళ్తున్న అదిపెద్ద వయసు వ్యక్తిగా విలియం శాట్నర్ నిలిచారు.
విలియం శాట్నర్ సరికొత్త చరిత్ర లిఖించారు. స్టార్ ట్రెక్ ఒరిజినల్ సిరీస్‌లో కెప్టెన్ కర్క్ పాత్ర పోషించిన నటుడు శాట్నర్ అక్టోబర్ 13న న్యూ షెఫర్డ్ క్రూ ఫ్లైట్ ద్వారా అంతరిక్షంలోకి వెళుతున్నారు. అందులో విశేషం ఏముందంటారా.. స్పేస్‌లోకి వెళ్తున్న అదిపెద్ద వయసు వ్యక్తిగా విలియం శాట్నర్ నిలిచారు. 90 ఏళ్ల వయసులో బ్లూ ఆరిజన్‌కు చెందిన న్యూ షెఫర్డ్ ఎన్ఎస్ 18 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్నారు.
మంగళవారం వెస్ట్ టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి స్పేస్ జర్నీ వాయిదా పడింది. బుధవారం సైతం తొలుత నిర్ణయించిన షెడ్యూల్ లో ప్రతికూల వాతావరణం ఉండటంతో 45 నిమిషాలు స్పేస్ లాంఛింగ్ వాయిదా వేశారు. కెప్టెన్ కర్క్ పాత్ర పోషించిన 50 ఏళ్ల అనంతరం విలియం శాట్నర్ అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఆయనతో మరో ముగ్గురు ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నారు.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Congratulations to the entire Blue Origin team on today’s mission and stay tuned for more from Launch Site One! #NS18
— Blue Origin (@blueorigin) October 13, 2021
మిషన్ టైమ్ లైన్..
స్పేస్ జర్నీకి అంతా సిద్ధంగా ఉన్నామని దీన్ని లీడ్ చేస్తున్న ఫ్లైట్ డైరెక్టర్ నిక్ పాట్రిక్, బ్లూ ఆరిజన్ డైరెక్టర్ ఆఫ్ ఆస్ట్రోనాట్ అండ్ ఆర్బిటాల్ సేల్స్ అరియానే కార్నెల్ ఎన్ఎస్ 18 మిషన్ అప్‌డేట్ అందించారు.
మిషన్ లాంచింగ్‌కు ఏడున్నర గంటల ముందు రాకెట్ లాంచ్ ప్యాడ్ చెక్ చేశారు. సాయంత్రం 4.43 గంటల సమయంలో న్యూ షెఫర్డ్ సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజన్ ట్వీట్ చేసింది. మిషన్ లాంచింగ్‌కు 3 గంటలకు ముందు రాకెట్ లోకి అవసరం ఉన్నవి నింపినట్లు క్లారిటీ ఇచ్చారు. సాయంత్రం 5.33 సమయంలో ఎన్ఎస్ 18 క్రూ లాంచ్ సైట్‌కు చేరుకుంది. లాంచింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రాత్రి 7.45కు హ్యాచ్ క్లోజ్ చేసినట్లు బ్లూ ఆరిజన్ తెలిపింది.
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!
We have confirmed separation of the capsule from the booster. Our astronauts are getting out of their seats and experiencing weightlessness. #NS18
— Blue Origin (@blueorigin) October 13, 2021
స్పేస్ లాంచ్ క్రూ మెంబర్స్ వీరే..
ప్లానెట్ ల్యాబ్స్ కో ఫౌండర్, నాసా మాజీ ఇంజినీర్ క్రిస్ బోషుజిన్, క్లినికల్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మెడిడేటా సొల్యూషన్స్ కో ఫౌండర్ గ్లెన్ డెవ్రిస్, బ్లూ ఆరిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆడ్రే పవర్స్.. వీరితో పాటు విలియం శాట్నర్ ఈ స్పేస్ ట్రిప్‌లో సభ్యుడిగా ఉన్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన అతిపెద్ద వయస్కుడిగా శాట్నర్ నిలిచారు.