అన్వేషించండి

Iran War Updates: అగ్రనేతలంతా మరణించినా ఇరాన్ ఎందుకు లొంగడం లేదు? - వాళ్ల బలం ఇదేనా?

Iran : ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. 15 మంది అగ్రశ్రేణి నాయకులు హతమైనా, దేశం అస్తవ్యస్తం కాకుండా ఇరాన్ ఇంకా పోరాడుతోంది.

Iran is not surrendering even after killing of 15 top leaders: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ  ఇరాన్  ఊహించని రీతిలో వ్యవహరిస్తోంది. గత కొద్ది కాలంగా జరిగిన దాడుల్లో ఇరాన్ పరమ పవిత్రంగా భావించే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ,  ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ హెడ్ , ఐఆర్‌జీసీ  ప్రతినిధి సహా దాదాపు  15 మంది అగ్రశ్రేణి నాయకులు హతమయ్యారు. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇంతటి కీలక నాయకత్వం తుడిచిపెట్టుకుపోతే ఆ వ్యవస్థ కుప్పకూలుతుంది. కానీ, ఇరాన్ మాత్రం పట్టువదలకుండా ప్రతిఘటిస్తోంది. దీనికి కారణం ఆ దేశం దశాబ్దాలుగా నిర్మించుకున్న  మొజాయిక్ డిఫెన్స్ అనే వికేంద్రీకృత యుద్ధ సిద్ధాంతం.

ఇరాన్ సైనిక వ్యవస్థ ఏ ఒక్క నాయకుడి మీదో లేదా సెంట్రల్ కమాండ్ మీదో ఆధారపడి లేదు. అగ్రనేతలు లేకపోయినా, క్షేత్రస్థాయిలోని చిన్న చిన్న సైనిక విభాగాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేయగలవు. గ్రీకు పురాణాల్లోని  హైడ్రా  అనే రాక్షసికి ఒక తల నరికితే మరో రెండు ఎలా పుట్టుకొస్తాయో, ఇరాన్ కమాండ్ స్ట్రక్చర్ కూడా అలాగే రూపొందించబడింది. ఒక నాయకుడు చనిపోగానే, తదుపరి బాధ్యతలు తీసుకునేలా రెడీ-టు-గో నాయకత్వాన్ని వారు సిద్ధం చేసుకున్నారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు  ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడం ఈ వ్యూహంలో భాగమే.

 ఈ యుద్ధం అమెరికా ఆర్థిక  రూ. 92,000 కోట్లకు పైగా పైగా ఖర్చు చేసినట్లు అంచనా. ఇరాన్ ప్రయోగించే చౌకైన డ్రోన్లను కూల్చడానికి అమెరికా ఖరీదైన క్షిపణులను వాడాల్సి రావడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించడం ఈ ఖర్చును భారీగా పెంచేసింది. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ, యుద్ధ క్షేత్రంలో తలెత్తుతున్న అనూహ్య సవాళ్లు పెంటగాన్‌ను కలవరపెడుతున్నాయి.

గాలిలో ఆధిపత్యం కోసం జరిగిన పోరులో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేర్వేరు దాడుల్లో ఇప్పటివరకు సుమారు 16 యుద్ధ విమానాలు/డ్రోన్లను  అమెరికా కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కువైట్,  ఇరాక్ సరిహద్దుల్లో ఎఫ్-15 రకానికి చెందిన విమానాలను ఇరాన్ క్షిపణులు కూల్చివేయడం అంతర్జాతీయ రక్షణ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇరాన్ తన వద్ద ఉన్న భారీ క్షిపణి సంపత్తిని ఉపయోగించి అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది.

ఇరాన్ బలం కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ , సిరియాలోని ప్రాక్సీ గ్రూపులు ఇప్పుడు ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి. తన నాయకత్వం దెబ్బతిన్న ప్రతిసారీ, ఇరాన్ తన ప్రాక్సీ నెట్‌వర్క్‌ను మరింత ఉధృతం చేస్తోంది. ఇజ్రాయెల్ మరియు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి.

 ఇరాన్‌ను కేవలం నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా జయించలేమని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. భారీ ఆర్థిక నష్టం, విమానాల విధ్వంసం అమెరికా వ్యూహకర్తలను పునరాలోచనలో పడేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు, మధ్యప్రాచ్యం మరో పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget