Viral News: కౌగలింతల సర్వీస్ - మగవాళ్లకు ఫుల్ డిమాండ్ - చైనాలో కొత్త ట్రెండ్
Man Mums : చైనాలో మహిళలలు... ఒత్తిడి తగ్గించేలా కౌగలించుకునేవారికి మహిళలు డబ్బులు చెల్లించి మరీ కౌగలింతల సర్వీస్ తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

Chinese Women Are Paying Rs 600 For Five Minute Hugs : చైనాలో కొంత మంది యవతులు ఇప్పుడు ఆప్యాయంగా హగ్ చేసుకున్న వారికి డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, భావోద్వేగాలను కంట్రోల్చేసుకోవడానికి మృదువైన స్వభావం ఉన్న పురుషులు నుండి ఐదు నిమిషాల కౌగిలింతల కోసం రూ. 600 చెల్లిస్తున్నారు. మృదువైన స్వభావం ఉన్న పురుషులను మాన్ మమ్స్ అని పిలుస్తున్నారు.
చైనాలో యువతులు "మాన్ మమ్స్" అని పిలిచే పురుషుల నుండి ఐదు నిమిషాల కౌగిలింతల కోసం సుమారు 50 యువాన్ లు చెల్లించడానికి సిద్ధపడుతున్నరు. యాభై యువాన్లు మన దేశంలో ఆరు వందలతో సమానం. ఈ "మాన్ మమ్స్" అనే పదం గతంలో జిమ్‌లో కసరత్తు చేసే బలిష్టమైన పురుషులకు వాడేవారు. ఇప్పుడు సౌమ్యత , ఓపిక వంటి సాంప్రదాయ స్త్రీ లక్షణాలతో బలాన్ని మిళితం చేసే పురుషులను ఉద్దేశించి ఉపయోగిస్తున్నారు. ఈ కౌగిలింతలు చాట్ యాప్‌ల ద్వారా ఏర్పాటు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా మాల్స్ లేదా సబ్‌వే స్టేషన్‌ల వంటి బహిరంగ ప్రదేశాలలో ఈ కౌగిలింతలు ఉంటాయి. ఒత్తిడితో కూడిన సమయాల్లో భావోద్వేగ ఉపశమనం అందిస్తున్నాయని చైనా మహిళల చెబుతున్నారు.
🫂У Китаї з’явилась нова послуга — самотні жінки можуть замовити чоловічі обійми
— Александр Колесник (@alexko1901) June 7, 2025
У Китаї самотні жінки можуть замовити 5-хвилинні чоловічі обійми за 7 доларів. Послуга називається Man Mums і набирає популярності серед жінок, які перебувають у стресі. https://t.co/VigepS2fxP
ఒత్తిడితో ఉన్న ఒక విద్యార్థిని తన థీసిస్ ఒత్తిడిని తట్టుకోవడానికి ఫిట్‌గా ఉన్న "మాన్ మమ్" నుండి కౌగిలింత కోసం చెల్లించాలని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. "సెకండరీ స్కూల్‌లో ఒకసారి కౌగిలించుకున్నప్పుడు సురక్షితంగా భావించాను. మనం సబ్‌వే స్టేషన్‌లో ఐదు నిమిషాలు కౌగిలించుకోవచ్చు." అని పోస్ట్ చేసింది. పోస్ట్ వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమయింది. . మహిళలు మర్యాద, ఓపిక, శారీరక రూపం, ఆకర్షణ ఆధారంగా "మాన్ మమ్స్"ను ఎంచుకుంటారు, సాధారణంగా ప్రైవేట్ చాట్‌ల ద్వారా మాట్లాడిన తర్వాత భేటీ అవుతారు.
In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.
— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025
They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws
ఈ ట్రెండ్ ప్రధానంగా చైనా ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. కొందరు ఎత్తు, అథ్లెటిక్ శరీరం కలిగిన మహిళలను కూడా ఈ సేవల కోసం పరిగణనలోకి తీసుకుంటారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఎలాంటి అసభ్యత లేకుండా.. కేవలం ఆప్యాయంగా,ప్రేమగా కౌగలించుకోవాలనుకునేవారికే.. ఈ సర్వీస్ సంతృప్తికరంగా ఉంటుందని చెబుతున్నారు.





















