అన్వేషించండి

Ukraine Naatu-Naatu: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంటి ముందు నాటు-నాటు, ఇరగదీసిన సైనికులు

Ukraine Naatu-Naatu: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉక్రెయిన్ సైనికులు స్టెప్పులేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ukraine Naatu-Naatu: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కు తోడు ఫాస్ట్ బీట్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా ఆస్కార్ ను తెచ్చిపెట్టింది నాటు నాటు సాంగ్. సినిమాలోని ఒరిజినల్ సాంగ్ చిత్రీకరణ ఉక్రెయిన్ లోని అధ్యక్ష భవనం ముందు జరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు 2021 ఆగస్టులో ఈ సాంగ్ షూటింగ్ జరిగింది. తాజాగా అదే చోట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అధికారిక నివాసం ముందు ఆ దేశ సైనికులు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాజాగా ఉక్రెయిన్ సైన్యం రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేసుకుని డ్రోన్ దాడులు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఏకంగా రష్యా రాజధాని మాస్కోపైనా డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. మాస్కోలోని నివాసప్రాంతాలపై ఈ డ్రోన్ దాడులు జరిగాయి. పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదే తరహాలో దాడులు చేసేందుకు వస్తున్న పలు డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైన్యం ఈ నాటు నాటు సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో రష్యాకు వ్యతిరేకంగానే చేసినట్టు  అర్థమవుతోంది. 

వీడియోలో ఏముందంటే..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని హిట్ సాంగ్ అయిన నాటు నాటుకు ఉక్రెయిన్ సైన్యం స్టెప్పులేసింది. దాదాపుగా అదే స్థాయి ఎనర్జీతో సైనికులు డ్యాన్స్ తో ఇరగదీశారు. ఈ సాంగ్ చిత్రీకరణ మొత్తం జెలెన్ స్కీ అధికారిక నివాసం ఎదుటే జరిగింది. సైనికులు యూనిఫామ్‌లు ధరించి డ్యాన్స్ చేస్తుంటే.. మరికొందరు వైట్ కలర్ యూనిఫామ్‌ లో బ్యాండ్ వాయిస్తూ కనిపించారు. మరికొందరు మహిళలు కలర్ ఫుల్ గౌనులు ధరించి పాటలో భాగమయ్యారు. ఈ స్టెప్పులు వేస్తూనే మధ్య మధ్యలో డ్రోన్లు ఎగురవేశారు. టార్గెట్ ప్రాంతంలో విజయవంతంగా బాంబులు జార విడిచారు. ఇందులో డ్రోన్లతో చేసిన విన్యాసాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం లేనట్లుగా వీడియోలో కనిపిస్తోంది. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత ప్రతీకారంగా రష్యా దాడులు ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ పై బాంబులతో విరుచుకుపడుతోంది. నివాస ప్రాంతాలు, సైనిక ప్రాంతాలు అనే తేడా లేకుండా బాంబాల వర్షం కురిపిస్తోంది. అందుకే జనసంచారం పెద్దగా లేనట్లు తెలుస్తోంది. 

ఉక్రెయిన్ సైన్యం చేసిన నాటు నాటు వీడియోను ఉక్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ జేన్ ఫెడోతోవా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget