America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?
America Area 51 : అమెరికాలో అత్యంత రిస్ట్రిక్టెడ్ ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నాయని బలమైన వాదన వినిపిస్తుంది. ఏలియన్స్ సాయంతో అమెరికా ఆర్థికంగా ఎదిగిందని వాదనలు లేకపోలేదు.
America Area 51 : మనిషిని పోలిన మనుషులు.. ఈ భూమిపై ఏడుగురు ఉంటారంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ భూగ్రహం దాటి ఇతర గ్రహాలకు వెళ్తే.. పరిస్థితి ఏంటి? మనిషిని పోలిన మనిషిని పక్కన పెడితే.. ఇతర గ్రహాలపై అసలు జీవం అనే ఉందా అన్నదే పెద్ద సందేహం. దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న బిగ్ క్వశ్చన్! అంతేకాదు.. ఈ భూమిపై ఎన్నో ఏళ్లుగా గ్రహాంతరవాసుల అన్వేషణ కొనసాగుతునే ఉంది. భూగ్రహంపై మనుషులు ఉన్నట్లే... ఇతర గ్రహాలపైనా ఎవరో ఒకరు ఉంటారనే సందేహం శాస్త్రవేత్తల్లో బలంగా ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఎదుగుదలలో ఏలియన్స్ హస్తం ఉందంటూ ఇప్పటికే చాలా వార్తలు వెలుగులోకి వచ్చాయి. అంతేందుకు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏలియన్స్‌తో చాలా సందర్భాల్లో కలుసుకున్నాడని, అతడికి ఆ గ్రహాంతర వాసులతో మంచి ఫ్రెండ్‌షిప్ కూడా ఉందన్న వార్తలు అప్పట్లో చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమెరికాలో ఉన్న అత్యంత రిస్ట్రిక్టెడ్ (Restricted) ప్రాంతమైన.. ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నాయని, అక్కడ నుంచే ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశాల వీక్‌నెస్ (Weakness) పాయింట్స్‌ను ఏలియన్స్ ద్వారా అమెరికా తెలుసుకుంటుందన్న టాక్ కూడా ఉంది. అయితే నిజానికి ఏరియా 51లో ఏం ఉంది..? అందులో నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా?
అంతుచిక్కని ప్రశ్న
ఏలియన్స్.... సైన్స్‌కు మాత్రమే కాదు.. గొప్ప గొప్ప సైంటిస్టులకు సైతం ఇప్పటి వరకు అంతుచిక్కని విషయం ఏదైనా ఉందంటే.. అది ఏలియన్స్ గురించనే చెప్పాలి. ఎందుకంటే.. దశాబ్దాల కాలంగా ఏలియన్స్ జాడను కనిపెట్టేందుకు ప్రపంచదేశాలు పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. ఏలియన్స్ గురించి ఏ ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోయాయి. కేవలం భూమిపై నుంచి కాదు.. స్పేస్‌లో కూడా ఏలియన్స్ గురించి పరిశోధనలు చేసి విఫలమైన దేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఏలియన్స్ జాడను కనిపెట్టడంలో బిజీగా ఉన్న ప్రపంచదేశాలకు గతంలో దిమ్మతిరిగే షాకింగ్ విషయం వెల్లడించారు ప్రఖ్యాతి భౌతిక శాస్ర్తవేత్త స్టీఫెన్ హ్యాకింగ్. ఏదైనా కొత్త ప్రదేశాన్ని, జీవరాశులను కనిపెడితే మానవులు సంతోషిస్తారని, కానీ ఏలియన్లు అలా భావించకపోవచ్చని అన్నారు. మనుషుల గురించి ఏలియన్లకు తెలిస్తే మన కంటే టెక్నాలజీ వినియోగంలో ఎన్నో రెట్లు ముందున్న వారు భూమిని నాశనం చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు స్టీఫెన్. అంతేకాదు.. కొలంబస్ మొదటిసారి అమెరికాను కనుగొన్నప్పుడు అక్కడి జనం ఆయనపై దాడి చేసినట్లు.. ఏలియన్లు మానవుల గురించి తెలుసుకున్నప్పుడు కూడా అలానే ప్రవర్తించే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు.. ఏలియన్స్ భూమి మీద నుంచి సిగ్నల్స్ పంపించడం కూడా అంత సురక్షితం కాదని అన్నారు.
యూఎఫ్ఓలో సంచారం
ఇంతటి ప్రమాదకరమైన ఏలియన్స్.. UFO అని పిలువబడే అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్లలో ఏరియా 51లో ఏలియన్స్ వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అమెరికా కొంత మంది గ్రహంతర వాసులను బంధించి ఏరియా 51లో ఉంచిందన్న వార్తలు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఏరియా 51 ప్రాంతంపై వచ్చిన వార్తలపై ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు అగ్రరాజ్యం. అంతేకాదు.. ఈ ఏరియా 51 ప్రాంతంపై నుంచి ఎలాంటి విమానాలు కానీ.. డ్రోన్లు ఎగరేయడం లేదా.. ఈ ప్రాంతం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది అమెరికా ప్రభుత్వం. ఈ ఏరియా 51లో పని చేసే వారు ఎవరు.? ఇంతకు మనుషులే చేస్తారా..? చేస్తే.. వాళ్లు అక్కడ ఏం చేస్తారు.? అన్న ఏ ఒక్క విషయం కూడా బయటకు రానివ్వదు అమెరికా. ఆ ప్రాంతంలో పని చేసేవాళ్లతో పాటు వాళ్ల వివరాలు సైతం చాలా సీక్రెట్‌గా ఉంచుతుందని, అలాగే వారి నెల వారి జీతాలు కూడా కేవలం క్యాష్ రూపంలో మాత్రం ఇస్తుందంటా అమెరికా. ఆ ప్రాంతంపై నుంచి ఎగిరేందుకు యాక్సిస్ ఉన్న కేవలం ఒకే ఒక ప్రత్యేక విమానంలో ఏరియా 51కు ఎంప్లయిస్‌ను తీసుకెళ్లి.. పని ముగిసిన తర్వాత తిరిగి వాళ్లను ఏయిర్‌పోర్ట్‌లో వదిలేస్తుందంటా. ఏరియా 51లో పని చేసే ఏ ఒక్కరు కూడా.. తాము అక్కడ పని చేస్తున్నట్లు ఎవరికీ చెప్పరంటా.
టాప్ సీక్రెట్
ప్రపంచదేశాల్లోని అత్యంత ధనిక దేశమైన అమెరికా.. వెపన్స్, టెక్నాలజీ, ఆర్థికపరమైన సక్సెస్‌కు కారణం ఏలియన్స్ అని బలంగా నమ్ముతున్న దేశాలు చాలానే ఉన్నాయి. అమెరికాను పాలించే ఆ దేశ ప్రెసిడెంట్స్‌కు మాత్రం ఈ విషయాలు తెలుస్తాయని, వాళ్లు పదవిలో ఉన్నప్పుడు లేదా.. ప్రెసిడెంట్ పదవి ముగిసిన తర్వాత కూడా ఏలియన్స్ గురించి లేదా.. అమెరికా సీక్రెట్స్ గురించి బయటకు చెప్పకూడదన్న రూల్ కూడా ఉందంటా. ఒకవేళ ఆ సీక్రెట్స్ గురించి బయటకు చెబితే.. వాళ్లను చంపేందుకు కూడా అమెరికా వెనకాడబోదన్న టాక్ కూడా ఉంది.