అన్వేషించండి

Woman Beard: అత్యంత పొడవైన గడ్డంతో గిన్నిస్ రికార్డు సృష్టించిన అమెరికా మహిళ

Woman Beard: అమెరికాకు చెందిన మహిళ అత్యంత పొడవైన గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.

Woman Beard: గిన్నిస్ వరల్డ్ రికార్డులు చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. కనీసం మన ఊహకు కూడా అందని అంశాల్లో ప్రతిభ కనబరిచి ప్రపంచస్థాయిలో ప్రాముఖ్యత సంపాందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో వింతైన విషయంలో ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఆ వ్యక్తికి వచ్చిన రికార్డు ఏంటి అనేదేగా మీ డౌట్.. అత్యంత పొడవైన గడ్డం కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. మరి ఆ వ్యక్తి గడ్డం ఎన్ని మీటర్ల పొడవు ఉందో తెలుసా.. 11.8 అంగుళాలు. ఆ మాత్రం గడ్డానికే గిన్నిస్ రికార్డు ఇచ్చారా.. చాలా మందికి ఉంటుంది కదా.. కొన్ని నెలల పాటు గడ్డం షేవ్ చేసుకోకపోతే మాక్కూడా పెరుగుతుంది అనుకుంటున్నారా? అవును పురుషులు కొన్ని నెలల పాటు షేవ్ చేసుకోకపోతే ఈజీగానే 11.8 అంగుళాల గడ్డాన్ని పెంచగలరు. అయితే తాజాగా గిన్నిస్ రికార్డు పొందిన వ్యక్తి పురుషుడు కాదు స్త్రీ. స్త్రీలకు గడ్డం ఉండదు. చాలా అరుదుగా కొంత మందిలో చిన్న చిన్న వెంట్రుకలు పై పెదాలపై, గడ్డం రూపంలో కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 11.8 అంగుళాల మేర గడ్డం పెరగడంతో అది గిన్నిస్ రికార్డు సాధించింది. 

అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్ అరుదైన ఈ రికార్డు అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం అందుకున్నారు. ఆమెకు 11.8 ఇంచ్ ల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు. గతంలో 10.04 అంగుళాల పొడవుతో అదే దేశానికి చెందిన వివాన్ వీలర్ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును తాజాగా ఎరిన్ హనీకట్ అధిగమించారు. మిషిగాన్ కు చెందిన హనీకట్ కు బాల్యం నుంచి జన్యుపరమైన సమస్యలు ఉండేవి. 13 సంవత్సరాలు వచ్చే నాటికి ఆమెకు గడ్డం పెరగడం మొదలైంది. మగవారిలా గడ్డం పెరుగుతుండటం పట్ల హనీకట్ తీవ్రంగా ఆందోళన చెందింది. రోజుకు మూడు నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేదాన్ని అని ఎరిన్ హనీకట్ తెలిపారు. అవాంఛిత రోమాలను తొలగించేందుకు రకరకాల క్రీములు, జెల్ లు వాడారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 

Also Read: PM Modi: బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై మోదీ మండిపాటు, రక్తంతో ఆడుకున్నారంటూ మమత సర్కారుపై ధ్వజం

కొన్నాళ్ల తర్వాత విపరీతమైన రక్తపోటుతో కంటి స్ట్రోక్ వచ్చింది. దీని వల్ల పాక్షికంగా దృష్టిని కూడా కోల్పోయారు. అప్పటి నుంచి రోజూ షేవ్ చేసుకోవడం మానేశారు. అలాగే రకరకాల క్రీములు వాడటం కూడా ఆపేశారు. దీంతో గడ్డం క్రమంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. దీంతో ఎరిన్ హానికట్ తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. చాలా కాలం పాటు కొన్నాళ్లపాటు నరకం అనుభవించారు. ఆమె రోజురోజుకూ కుంగిపోయారు. ఆమె మానసిక పరిస్థితి మరింత క్షీణించుకుపోవడంతో.. ఆమె స్నేహితులు, బంధువులు గడ్డం ఉంటే తప్పేంటని అన్నారు. ఇలా ఇంకా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించే వారు. క్రమంగా ఆందోళన విడిచిపెట్టారు ఎరిన్ హనీకట్. గడ్డం పెంచడంపైనే దృష్టి పెట్టారు. అలా తన గడ్డం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eiffel Tower : వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!
వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!
Donald Trump On Iran War: ఇరాన్‌తో యుద్ధం ఆపేది లేదు! ఆపరేషన్ ఎపిక్‌ ప్యూరీపై ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్‌తో యుద్ధం ఆపేది లేదు! ఆపరేషన్ ఎపిక్‌ ప్యూరీపై ట్రంప్ సంచలన ప్రకటన!
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ వివాదం!ట్రంప్ హెచ్చరికలు లైట్ తీసుకున్న టెహ్రాన్! బ్రిటన్ సరికొత్త ప్రతిపాదన!
అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ వివాదం!ట్రంప్ హెచ్చరికలు లైట్ తీసుకున్న టెహ్రాన్! బ్రిటన్ సరికొత్త ప్రతిపాదన!
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
Eiffel Tower : వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!
వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!
Embed widget