అన్వేషించండి

US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!

US Iran War: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. దీంతో భారీ విధ్వంసం నెలకొంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్‌లోని సైనికులపై ఇరాన్ దాడి.
  • సిరియా, ఉత్తర ఇరాక్‌లో కుర్దిష్ తిరుగుబాటుదారులపైనా ఇరాన్ దాడులు.
  • కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.
  • హోర్ముజ్ జలసంధి మూసివేస్తామని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.

US Iran War: పశ్చిమాసియా రణక్షేత్రం రగులుతోంది. అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ పెను విధ్వంసం చేస్తోంది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికా సైనికులపై విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్‌లతో మూకుమ్మడిగా దాడి చేస్తోంది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లు ప్రయోగించింది. ఈ దాడుల్లో దాదాపు 8 మంది మృతి చెందినట్టు ప్రసారం జరుగుతోంది. 

ప్రతికారు దాడులు చేస్తున్న ఇరాన్ 

అమెరికా రాత్రి ఇరాన్‌పై విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్‌లో ఉన్న సైనికులను టార్గెట్ చేసింది. ఇలా ఒక దేశంపై ఒకరు టార్గెట్ చేసుకోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందా అనే టెన్షన్ ఆ ప్రాంత దేశాల్లో నెలకొంది. మరోవైపు హోర్మూజ్ జలసంధిలో ఎగుమతులకు అనుమతి లేదని ఇరాన్ చెప్పడం కూడా ఆందోళన కలిగిస్తోంది. 

అమెరికాను టార్గెట్ చేసుకున్న ఇరాన్, దానికి మద్దతు ఇచ్చిన దేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే జోర్దాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను జోర్డాన్‌ దళాలు కూల్చేశాయి. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ ప్రకటించింది. అయితే తాము అమెరికాకు చెందిన ఫ్యూయల్ సప్లై విమానాలు, యుద్ధ విమానాలను టార్గెట్ చేసినట్టు తెలిపింది. ఇందులో చాలా వాటిని నాశనం చేశామని ఇరాన్ రివల్యూషన్ గార్డ్‌ ప్రకటించింది. అమెరికా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని జోర్డాన్ ప్రజలకు ఇరాన్ పిలుపునిచ్చింది. వారికి సహకరిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యతవహించాలని అన్నారు. 

అమెరికా స్థావరాలపై దాడులు చేశామన్న ఐఆర్‌జీసీ

ఇరాన్‌పై దాడి చేసి సైనికుల హత్యకు కారణమైన అమెరికా టార్గెట్ చేస్తున్నట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. అందులో భాగంగా సిరియాలోని అల్‌ తాన్ఫ్‌లో ఉన్న అమెరికా స్పెషల్‌ ఆపరేషన్ కమాండ్‌ కేంద్రంపై దాడి చేశామని తెలిపారు. అయితే దీనికి తగిన ఆధారాలు చూపించం లేదు. 

ఉత్తర ఇరాన్‌లో దాడులు- 9 మంది మృతి  

ఉత్తర ఇరాన్‌లో కూడా దాడులు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో అటానమస్‌గా ప్రకటించుకున్న కుర్దిష్‌ ప్రాంతంలోని ఇర్బిల్‌, సులైమానియాలో కూడా బాంబులు పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఇరాన్‌ కుర్దిష్ తిరుగుబాటుదారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది ఈ అటాక్‌లో దాదాపు 9 మంది చనిపోయినట్టు, మరికొందరు గాయపడినట్టు చెబుతున్నారు.

బలగాలను వెనక్కి తీసుకున్నట్టు అమెరికా ప్రకటన 

అయితే ఇరాన్ దాడులు చేస్తున్నట్టు చెప్పిన ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. సిరియా, జోర్దాన్, ఇరాక్ సరిహద్దుల్లోని అల్తానుఫ్‌లో అమెరికా సైనికులు లేరని తెలిపింది. మరోవైపు ఈ ఘర్షణలకు దూరంగా ఉండాలని సిరియా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇదే విషయాన్ని సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌షారా గతంలోనే కీలక ప్రకటన చేశారు. తమపై దాడి చేస్తే తప్ప వేరే దేశాలపై దాడుల గురించి స్పందించబోమని వెల్లడించింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై తమ పట్టు సడలిపోలేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడులు చేస్తున్నంత కాలంలో జలసంధి మీదుగా ఎలాంటి ఎగుమతులు జరిగేందుకు అనుమతించబోమని ప్రకటించింది. 

Frequently Asked Questions

పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏం జరుగుతోంది?

అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనికులపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేస్తోంది.

జోర్డాన్‌పై దాడుల గురించి ఇరాన్ ఏం ప్రకటించింది?

జోర్డాన్ తమ క్షిపణులను కూల్చివేసినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ పేర్కొంది. అయితే, తమ సైనికులు అమెరికా ఇంధన సరఫరా విమానాలను, యుద్ధ విమానాలను ధ్వంసం చేశారని తెలిపింది.

దాడి జరిగిన ప్రాంతాల్లో అమెరికా బలగాలు ఉన్నాయని ధృవీకరించిందా?

ఇరాన్ దాడి చేసినట్లు చెప్పిన సిరియాలోని అల్-తాన్ఫ్‌తో సహా సరిహద్దు ప్రాంతాల నుండి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. అక్కడ సైనికులు లేరని తెలిపింది.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ వైఖరి ఏమిటి?

హోర్ముజ్ జలసంధిపై తమ పట్టు సడలలేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడులు కొనసాగినంత కాలం జలసంధి మీదుగా ఎలాంటి ఎగుమతులను అనుమతించబోమని హెచ్చరించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget