Waiter Job in Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం బారులు తీరిన భారతీయ విద్యార్థులు- వైరల్‌గా మారుతున్న వీడియో!
Viral Video: వెయిటర్లు, ఇతర సేవల కోసం ఓ రెస్టారెంట్ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అంతే వేల మంది భారతీయులు క్యూ కట్టారు. వాళ్లంతా విద్యార్థులు కావడం ఇక్కడ ఆశ్చర్యం.
Indians In Canada: చాలా మందికి విదేశాలకు వెళ్లి మంచిగా చదువుకొని అక్కడే స్థిరపడిపోవాలని కలలు కంటారు. అక్కడ చదువుతోపాటు వేరే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటే ఖర్చుల వరకు సరిపోతుందని ఇంటి నుంచి పంపించిన డబ్బులు చదువుకు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటారు. ఇది సగటు భారతీయులు ఆలోచన. అలా ఆలోచన చేసే వారికి షాకింగ్ న్యూస్ ఇది. అక్కడ పోటీ ఎంత ఉందో చెప్పే నిజం ఇది. విదేశాల్లో ఏదో చేసేద్దామని గుడ్డిగా నమ్మే వాళ్ల కళ్లు తెరిపించే దశ్యమిది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్‌లో వందల మంది భారతీయ విద్యార్థులు నిలబడి ఉన్నారు. వాళ్లంతా తినడానికి అలా క్యూలో ఉన్నారనుకుంటే మాత్రం తందూరీ గ్రిల్స్‌లో వేలు పెట్టినట్టే. అవును ఆ రెస్టారెంట్‌లో వెయిటర్‌తోపాటు ఇతర సేవలు చేసేందుకు పడుతున్న పోటీ ఇది. ఉద్యోగం, చదువు కోసం అక్కడకు వెళ్లిన భారతీయుల పడుతున్న వెతలకు ఇదో ఉదాహరణ
More than 3,000 mostly Indian students line up for waiter and dish washing jobs at a new restaurant in Brampton, Canada. Total number of applications received - 70,000. Indian parents planning to send their children to Canada should wake up to the reality that the party is over… pic.twitter.com/Kn8j4EUh8U
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) October 5, 2024
వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే సుమారు 3,000 మంది క్యూలో నిలబడి ఉన్నారు. రెస్టారెంట్‌లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లే వీళ్లంతా. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కెనడాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తామనుకునే వాళ్లకు కనువిప్పు కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ట్రూడో కెనడాలో స్టాండింగ్‌లో మేఘ్ అప్‌డేట్ పోస్ట్ చేశారు, ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని! కెనడాలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్న వారి మదిలో అనేక సందేహాలకు తావిస్తోంది. భారతదేశం వెలుపల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మిలియన్ల మంది భారతీయ విద్యార్థులకు కలగా కలగానే మిగిలిపోనుందా? అక్కడ స్థిరపడి మంచి ఉద్యోగ చేసుకోవచ్చనుకునే వాళ్లకు నిరాశ తప్పదా అనే చర్చకు ఈ వీడియో కారణమవుతోంది. బ్రాంప్టన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన భారతీయుల దృష్టిని మాత్రం ఆకర్షించింది. ఈ వీడియోను 1.9 మిలియన్లకుపైగా నెటిజన్లు చూశారు. షేర్‌లు చేస్తున్నారు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.