అన్వేషించండి

Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో

Empire State Building: వాళ్లిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఎక్కడంటే.. 1,454 అడుగుల ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన. అది కూడా బిల్డింగ్ పైన ఉన్న యాంటెన్నా పైకి వెళ్లి.

Rooftop Daredevils Engagement Viral Video:  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన భవనాలు, స్కైస్క్రాపర్‌లను ఎలాంటి రక్షణ పరికరాలు  లేకుండా ఎక్కుతూ, మృత్యువుతో చెలగాటమాడే రష్యన్  రూఫ్‌టాపర్స్  జంట ఏంజెలా నికోలావ్, ఇవాన్ బీర్కస్ మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేసే ఈ  రష్యన్ డెవిల్స్  జంట, ఈసారి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన, 1,454 అడుగుల ఎత్తు గల చారిత్రాత్మక  ఎంపైర్ స్టేట్ బిల్డింగ్  ను ఎంచుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మహానగర చిహ్నం  యాంటెన్నా కొనకు వీరు ఎవరికీ తెలియకుండా, అనధికారికంగా చేరుకుని ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు.

అయితే, ఈసారి వీరు అంతటి ప్రమాదకరమైన సాహసం చేయడం వెనుక కేవలం వ్యూస్ కోసమో, లైకుల కోసమో కాదు.. వారి జీవితకాలపు ప్రేమను ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఒక అద్భుతమైన కారణం దాగి ఉంది. భవనం అత్యంత ఎత్తైన యాంటెన్నా భాగానికి చేరుకున్న ఈ జంట, అక్కడ ఒక ప్రత్యేకమైన బ్యానర్‌ను ప్రదర్శించారు. అంతులేని ఎత్తులో, వీచే బలమైన గాలుల మధ్య ఆ బ్యానర్ ప్రదర్శించిన కాసేపటికే, వారు యాంటెన్నా నుండి కొద్దిగా కిందికి దిగి ఒక సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. అక్కడ న్యూయార్క్ నగరం మొత్తం కంటికి కనిపించే వేళ.. ఇవాన్ బీర్కస్ తన మోకాళ్లపై కూర్చుని అత్యంత రోమాంచితమైన రీతిలో ఏంజెలాకు వివాహ ప్రతిపాదన   చేశాడు.
 
 ఊహించని ఈ సర్‌ప్రైజ్‌కు ఏంజెలా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆకాశమే సాక్షిగా ఇవాన్ చేసిన ప్రపోజల్‌ను ఆమె వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటైన ఆనందంలో కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. న్యూయార్క్ సిటీ బ్యాక్‌డ్రాప్‌తో తన నిశ్చితార్థపు ఉంగరాన్ని  చూపిస్తూ ఏంజెలా పోస్ట్ చేసిన సెల్ఫీలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.  

ఈ అద్భుతమైన విజువల్స్ నెట్‌లో వైరల్ అయినప్పటికీ, అమెరికన్ చట్టాలు , న్యూయార్క్ పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం చట్టప్రకారం నేరం. గతంలోనూ ఇలాంటి సాహసాలు చేసినందుకు ఈ జంట పలు దేశాలలో జైలు శిక్షలు, జరిమానాలు ఎదుర్కొంది. ఇప్పుడు అమెరికాలోనూ వీరిపై అక్రమ ప్రవేశం, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

న్యూయార్క్ చట్టాల ప్రకారం, ఇలాంటి నేరాలకు భారీగా జరిమానాతో పాటు కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, భవిష్యత్తులో వీరు అమెరికా రాకుండా  డిపోర్టేషన్,  వీసా రద్దు వంటి కఠిన శిక్షలు కూడా విధించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, చట్టపరమైన చిక్కులు, పోలీసుల శిక్షలు ఎలా ఉన్నా.. మృత్యువు అంచున నిలబడి వీరు పండించిన ఈ సరికొత్త ప్రేమకథ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చట్టాలను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూనే, వారి అసాధారణ ప్రేమాభిమానాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget