Rishi Sunak Defends PM Modi: బ్రిటీష్ పార్లమెంటులో ప్రధాని మోదీని సమర్థించిన రిషి సునక్!
Rishi Sunak Defends PM Modi: గుజరాత్ అల్లర్ల అప్పుడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై దాడి చేసేలా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమర్థించబోనని తేల్చి చెప్పారు.
Rishi Sunak Defends PM Modi: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల అప్పుడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై దాడి చేసేలా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమర్థించబోనని బ్రిటన్ పార్లమెంటులో తేల్చి చెప్పారు. బీబీసీ ప్రసారం చేసిన 2 భాగాల డాక్యుమెంటరీతో తాను ఏకీభవించనని చెబుతూ ఒకరకంగా మోదీ పాలనను వెనకేసుకొచ్చారు. వివాదాస్పదనమైన బీబీసీ 2 భాగాల డాక్యుమెంటరీ గురించి ప్రస్తావనను బ్రిటన్ పార్లమెంటులో పాకిస్థాన్ మూలాలున్న ఎంపీ ఇమ్రాన్ హుస్సైన్ లేవనెత్తారు. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లు, అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాలన గురించి ప్రస్తావించారు. ఎంపీ లేవనెత్తిన అంశంపై స్పందించిన రిషి సునాక్ తాను బీబీసీ ప్రసారం చేసిన ఆ డాక్యుమెంటరీతో ఏకీభవించడం లేదని, ఆ వివరాలతో సమర్థించడం లేదని తేల్చి చెప్పారు.
గుజరాత్ అల్లర్ల అంశంపై యూకే ప్రభుత్వ వైఖరి దీర్ఘకాలంగా స్పష్టంగా ఉందని సునాక్ తెలిపారు. ఆ వైఖరి ఏమాత్రం మారలేదని అన్నారు. హింస ఎక్కడ జరిగినా తాము సహించబోమని చెప్పారు. 2002 సంవత్సరంలో గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ అంశంపై యూకే నేషనల్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ రెండు భాగాలున్న ఓ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీని నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కొన్ని ప్రసార మాధ్యమాల నుండి ఈ డాక్యుమెంటరీని తీసేశారు.
ప్రముఖ భారతీయ సంతతి యూకే పౌరులు ఈ సిరీస్ ను ఖండించారు. యూకేకి చెందిన లార్డ రమీ మాట్లాడుతూ.. బీబీసీ చేసిన ఈ సిరీస్ లక్షలాది మంది భారతీయులను బాధకు గురించి చేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, భారత పోలీసు, న్యాయవ్యవస్థను కూడా అవమానించినట్లే అవుతుందన్నారు. అల్లర్లు, ప్రాణనష్టాన్ని తాము కూడా ఖండిస్తున్నట్లు వివరించారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇది పూర్తిగా పక్షపాత ధోరణితో రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ అని పేర్కొంది. ఈ వారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఎంఈఏ ప్రతినిధి బాగ్చి మాట్లాడుతూ.. కావాలనే బీబీసీ ఈ సిరీస్ ను ప్రచారం చేస్తోందని అన్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. పక్షపాత ధోరణిలో మాత్రమే వ్యవహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.