అన్వేషించండి

Telegram CEO Pavel Durov: నేను 100 మంది పిల్ల‌ల‌కు తండ్రిని -12 దేశాల్లో నా సంతానం- సంచలన ప్రకటన చేసిన టెలిగ్రామ్ సీఈవో

Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తానొక స్పెర్మ్ డోన‌ర్‌ని అనే విష‌యాన్ని ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే తాను 12 దేశాల‌‌లో వంద మంది పిల్ల‌ల‌కు బ‌యోలాజిక‌ల్ ఫాద‌ర్‌గా ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు. 

Telegram CEO: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన పావెల్ దురోవ్ ఆస‌క్తిక‌ర పోస్టుతో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించాడు. తాను 12 దేశాలలో 100 మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని (Biological father ) అని పేర్కొన్నారు. త‌న సుదీర్ఘ పోస్ట్‌లో, దురోవ్ త‌న గురించి చెబుతూ గ‌తంలో తాను చురుకైన స్పెర్మ్ దాతగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు. తన టెలిగ్రామ్ ఛానెల్‌లో దురోవ్‌కు 5.82 మిలియన్ల  మంది సబ్‌స్క్రైబర్ లు ఉన్నారు. టెలిగ్రామ్‌లో రాసిన ఈ పోస్ట్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. 

 స్పెర్మ్ డోన‌ర్‌గా ఎలా మారానంటే... 

22 సంవత్సరాల వయస్సులోనే రష్యా అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్ Vkontakteని సృష్టించిన ఈ 39 ఏళ్ల దురోవ్, తన DNA ను "ఓపెన్ సోర్స్" చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగా జీవించే వ్య‌క్తికి ఇంత‌మంది పిల్ల‌లు ఎలా పుట్టార‌నుకుంటున్నారా..? ఇదెలా సాధ్య‌మ‌ని అనుకుంటున్నారా అని ప్ర‌శ్నించాడు. తాను స్పెర్మ్ డోన‌ర్ అనే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా పంచుకున్నాడు. త‌న ఫ్రెండ్ కార‌ణంగా తాను స్పెర్మ్ డోన‌ర్‌గా మారాన‌ని అప్ప‌టి సంగ‌తుల‌ను పంచుకున్నాడు. ప‌దిహేనేళ్ల క్రితం త‌నకు త‌న స్నేహితుడి నుంచి క్లీనిక్‌కు రావాల‌ని ఫొన్ వ‌చ్చింద‌ని చెప్పాడు. తీరా అక్క‌డికి వెళ్లాక తన‌ను స్పెర్మ్ డొనేట్ చేయ‌మ‌ని అడ‌గ‌డంతో న‌వ్వుకున్నాన‌ని అన్నాడు. త‌న‌కు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని, కానీ త‌న‌కు త‌న భార్య‌కు పిల్ల‌లు కావాల‌ని కాసేప‌య్యాక త‌న ఫ్రెండ్ చాలా సీరియ‌స్‌గా త‌న ప‌రిస్థితిని వివ‌రించాడ‌ని దీంతో స్పెర్మ్ డోన‌ర్‌గా మారాల్సి వ‌చ్చింద‌న్నారు.  

బ‌య‌ట నాణ్య‌త గ‌ల ఆరోగ్య‌క‌ర‌మైన‌ స్పెర్మ్ కొర‌త ఉంద‌ని, ఆరోగ్య‌వంతులు ముందుకొచ్చి స్పెర్మ్ దానం చేసి బిడ్డ‌లు లేని జంట‌ల‌కు సాయం చేయాల‌ని కోరాడు. అయితే ఇప్ప‌టికే తాను స్పెర్మ్ డొనేట్ చేయ‌డం ఆపేసి చాలాకాలం అయ్యింద‌ని, కానీ ప్ర‌పంచంలో ఏదొక IVF సెంట‌ర్‌లో త‌న స్పెర్మ్ త‌ప్ప‌కుండా అందుబాటులో ఉండే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.   

ఇప్పుడెందుకు బ‌య‌ట‌పెట్టిన‌ట్టు..? 

తన జీవసంబంధమైన పిల్లలంద‌రూ ఒకరినొకరు మరింత సులభంగా కనుగొనగలిగేలా తన DNAని ఓపెన్ సోర్స్ చేయాలని యోచిస్తున్నట్లు పావెల్ దురోవ్ త‌న పోస్ట్‌లో చెప్పారు. అయితే దీనిలో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని అంగీక‌రించారు. కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆరోగ్య‌క‌ర‌మైన స్పెర్మ్ కొర‌త పెద్ద స‌మ‌స్య‌గా ఉంద‌ని చెప్పారు. తాను స్పెర్మ్ డోన‌ర్ అని చెప్పుకోవ‌డానికి సంకోచించ‌డం లేద‌ని చెప్పిన ఆయ‌న‌, త‌న వంతుగా చాలా మంది జంట‌ల‌కు పిల్ల‌లు క‌లిగేందుకు సాయం చేశాన‌ని చెప్పుకొచ్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget